భారీ వర్షాల కారణంగా రైతులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు శుక్రవారం నల్గొండ, సూర్యాపేట,ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నకిరేకల్, చిట్యాల మార్కెట్ యార్డులకు వెళ్లి రైతులతో స్వయంగా మాట్లాడి, వర్షాల ప్రభావం వల్ల జరిగిన పంట నష్టాలను వివరంగా తెలుసుకున్నారు.
అనంతరం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మోతే మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడి, కేంద్రాల్లో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు భారీ వర్షాల కారణంగా తమ ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, తమ రెక్కల కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో మొలకలు ఎత్తే పరిస్థితి ఏర్పడిందని, పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు–రైస్ మిల్లర్లు కుమ్మక్కై తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతుల ధాన్యం తడిసి నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
అయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని చెప్పారు. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన పంట నష్టాల పరిస్థితిని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
చాలా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ ఆర్పే మిషన్లు, నిల్వ సదుపాయాలు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఫలితంగా చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై దళారీ వ్యాపారంతో రైతులను దోచుకుంటున్నారని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాన్స్‌పోర్ట్, బస్తాలు, సుతిల్, హమాలి చార్జీలు — అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రం కొనుగోలు కోసం అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనడంలో ఎందుకు ఆలస్యం చేస్తోందని రాంచందర్ రావు ప్రశ్నించారు.
ట్రాన్స్‌పోర్ట్, బస్తాలు, సుతిల్, హమాలి చార్జీలు — అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రం కొనుగోలు కోసం అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనడంలో ఎందుకు ఆలస్యం చేస్తోందని రాంచందర్ రావు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు రైతుల ధాన్యం కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, రైస్ మిల్లర్లు – కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న దళారీ వ్యాపారాన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ ఆర్పే మిషన్లు, నిల్వ సదుపాయాలు తక్షణమే కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల రెక్కల కష్టం వృథా కాకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

More Stories
విదేశీ నిధులకోసం క్రైస్తవ సంస్థలో `జోగినులు’గా విద్యార్థినులు
మొదటిసారి పాకిస్థాన్ లో సంస్కృత తరగతులు!
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు