అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు, వాలెట్ లోడింగ్కు సంబంధించి నవంబర్ 1వ తేదీ నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి చేసే ఎడ్యకేషన్ ఫీజు చెల్లింపులపై ఇకపై 1 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ వెబ్సైట్లు, పీఓఎస్ మెషీన్ల వద్ద చేసే చెల్లింపులకు ఈ ఫీజు వర్తించదు. వాలెట్లో రూ.1000 మించి చేసే లావాదేవీలకు 1 శాతం ఫీజు వర్తిస్తుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్‌కు మారేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన గడువు నవంబర్ 30తో ముగియనుంది. వాస్తవానికి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే తొలుత ఈ గడువు ఇచ్చారు. దాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పెన్షన్ పొందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ 1 నుంచి 30లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ అందుకొనే వ్యక్తులు తాము జీవించి ఉన్నట్లు ఈ పత్రాన్ని సమర్పించాలి. ప్రతి ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 80 ఏళ్లు దాటిన వ్యక్తులకు అక్టోబర్ 1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
కాగా, ఆధార్కార్డు వినియోగ దారులు ఇకపై ఆధార్ను అప్డేట్ చేయాలంటే ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనీలేదు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఇలా దేనినైనా అప్డేట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో సులభంగా చేసుకోవచ్చు. కానీ వీటికి కొన్ని ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా ఒక్కోప్రక్రియకు ఒక్కోవిధంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పాన్- ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది.

More Stories
అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!
డ్రగ్స్‌పై బ్రెజిల్ భారీ ఆపరేషన్.. 64 మంది మృతి
రష్యా సంస్థతో హెచ్ఏఎల్ విమాన తయారీ ఒప్పందం