తెలంగాణలో నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వ విడుదల చేయకపోవడంతో కాలేజీలు నడిపే పరిస్థితుల్లో తాము లేమని ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.1200 కోట్ల బకాయిలను దీపావళి లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేశారని తెలిపారు. మంత్రులు తమకు సహకరించడం లేదని పేర్కొంటూ నవంబరు 1వ తేదీ లోపు రూ.900 కోట్లు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి సమాఖ్య డిమాండ్ చేసింది.
మిగిలిన బకాయిలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నవంబరు 1న రూ.900 కోట్లు విడుదల చేయకపోతే 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటిస్తామని ఫెడరేషన్ వెల్లడించింది. నవంబర్ 10వ తేదీ లోపు 2 లక్షల మందితో సమావేశం నిర్వహిస్తామని, ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా తమ నిరసన కార్యక్రమాలు ఉంటాయని రమేష్ బాబు తెలిపారు.
ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు అడిగినప్పుడే ప్రభుత్వ విచారణలు ఉండకూడదని చెబుతూ వాళ్ల స్వార్థం కోసం తమను భయపెడితే ఊరుకోమని హెచ్చరించారు. ఒక్క పోలీసును కూడా కాలేజీల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ సొమ్మును ప్రభుత్వం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెల్లించకపోవడంతోనే బకాయిల సమస్య పెద్ద గుదిబండగా మారింది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్, బీఈడీ, లా తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు కలిపి మొత్తం 1,500 వరకు ఉన్నాయి. వాటికి ఏటా రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం నగదు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఏ ఏడాదికి సంబంధించిన బోధనా రుసుములు ఆ ఏడాది చెల్లింపులు జరగలేదు.
2022-23, 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన మొత్తాలే ఏకంగా రూ.7,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంటే వీటిలో గత ప్రభుత్వ హయాంలోని 2022-23, 2023-24 సంవత్సరాల బకాయిలు కూడా ఉన్నాయి.

More Stories
కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి
ఓ మతానికి ముడిపెట్టి గోమాతను అవమానించడం సరికాదు
అధికారం కోల్పోగానే బిఆర్ఎస్ కు విరాళాలలో గట్టి ఎదురుదెబ్బ