జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ బిజెపి నేతల ప్రచారం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు రెండు కళ్లలాంటివని,  రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని మాధవ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ పార్టీ బాధ్యతలతో తెలంగాణాలో కూడా పనిచేసిన అనుభవం తనకు ఉందని, అదేవిధంగా బార్ కౌన్సిల్ సభ్యునిగా ఏపీలో విస్తృతంగా పనిచేసిన అనుభవం రామచందర్ రావుకు ఉందని ఆయన గుర్తు చేశారు. అందుకనే ఇద్దరం ఉమ్మడిగా రెండు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని తేలియార్.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోందని, డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని మాధవ్ గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అమరావతి, రాయలసీమ – ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఒక సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ఊహించని విధంగా రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం, అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం జరిగిందని వివరించారు.

ఏపీ భవిష్యత్తును మలుపుతిప్పేలా సుమారు 15 బిలియన్ డాలర్స్ పెట్టుబడులతో విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, అలాగే, దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ  ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని చెబుతూ దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందని వెల్లడవుతోంది చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ ఇన్వెస్ట్మెంట్స్ రావడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ప్రధానమైంది. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ అవకాశాలన్నింటిని అందిపుచ్చుకొని ముందుకువెళ్తోందని చెప్పారు.

అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగుతుందని చెబుతూ ఆ దేశంగా బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. పీవీఎన్ మాధవ్ తో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధికార ప్రతినిధి జయప్రకాష్ గారు కూడా విచ్చేశారు.