
‘తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిండు..’ ఇదేదో ప్రతిపక్షాలు చెప్పిన మాటలు కాదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలు! తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో ఖర్గే తన బాధను పంచుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
‘సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేకసార్లు లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తిగా, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్న. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం’ అని ఖర్గే తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేండ్లు కూడా గడవకముందే ప్రభుత్వం పతనం కావడం, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఇటీవల గుండెకు సంబంధించి చిన్న చికిత్స చేయించుకున్న మల్లికార్జున ఖర్గేను ఈ నెల 15న కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనర్సింహ, అసంతృప్త ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో కలిసి పరామర్శించారు. ఆ సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన సమయంలో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతెన్నులపై ఆయన ఆవేదన వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని ఖర్గే విమర్శించారు. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని, మంత్రుల మధ్య కీచులాటలు, వాటాల పంపకాల లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని ఆవేదన చెందారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర ఖర్గే వాపోయారట.
మొదటి నుంచి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదని, ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదని ఖర్గే అన్నారని సమాచారం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందనే సంకేతాలు వెళ్తున్నాయని, అది పార్టీకి తీవ్ర నష్టం చేసిందని తెలిపారట. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న రెడ్లు, దళితులు ఈ అంశం వల్ల మనకు దూరం అయ్యారని పేర్కొన్నారు.
పోనీ బీసీలు అయినా మనకు దగ్గర అయ్యారా అంటే అదీ లేదు. రేవంత్ చేసిన నిర్వాకం వల్ల అన్ని కులాల వాళ్లూ కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారని మండిపడ్డారట. అనవసరంగా రేవంత్ ఇందులోకి రాహుల్ గాంధీ పేరును లాగాడని. ఇది రాహుల్ ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేసిందని బాధపడ్డారట.
More Stories
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!
జూబ్లీ హిల్స్ లో బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
తెలంగాణాలో ముస్లిం అరాచక శక్తులు విశృంఖల విహారం