ఇరాన్ అణు స్థావరాల ధ్వంసం ట్రంప్ ఊహల్లోనే!

ఇరాన్ అణు స్థావరాల ధ్వంసం ట్రంప్ ఊహల్లోనే!
 
ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని, కనై అదే ఆయన ఊహల్లోనే జరిగిందని ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యే ఖమేనీ కొట్టిపారేసారు. అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు, ఇతర దేశాల స్వతంత్రతను గౌరవించాలని ఆయన హితవు చెప్పారు.  “మా దేశంలోని సైన్స్ పరిశోధకులను వాదించారు. కానీ వారి జ్ఞానం ఎప్పుడూ నాశనం కాలేదని మా సైన్సు, న్యూక్లియర్ పరిశ్రమలు అందరికీ తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు” అని స్పష్టం చేస్తూ అమెరికాపై ఖమేనీ కఠిన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 

“ఒక దేశానికి న్యూక్లియర్ పరిశ్రమ ఉండటం వల్ల ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అవసరం లేదు. మాకు కూడా మా పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి హక్కు ఉంది. సైన్సు, న్యూక్లియర్ నొలెడ్జ్ నష్టపరిచే ప్రయత్నాలు ఫలితం ఇవ్వవు” అని ఖమేనీ హెచ్చరించారుఇరాన్ సైన్సు రంగానికి, ప్రత్యేకంగా న్యూక్లియర్ పరిశ్రమకు ఖమేనీ మద్దతు వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన విధంగా, సైన్స్, టెక్నాలజీకి రాజకీయాలు, వైవిధ్యపు అభ్యంతరాలుగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు. 

 “ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తుంది? ఇతర దేశాలపై జోక్యం చేసుకోవడానికి ఎవరికీ అర్హత లేదు” అని ఖమేనీ ప్రశ్నించారు. ఆయన అభిప్రాయంలో, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశపు తన స్వతంత్ర అభివృద్ధి, సైన్సు రంగంలో పురోగతిపై జోక్యం చేయకూడదు. ఈ వ్యాఖ్యలు అమెరికా–ఇరాన్ సంబంధాలపై కొత్త చర్చలను రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు దీనిని ఉభయ దేశాల మధ్య ధోరణి మార్పుకు సూచనగా చూస్తున్నారు.