
ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఎన్నికల సంఘం పౌరుల నుంచి సేకరించే సమాచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల వ్యక్తిగత సమాచారం కావడంతో అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, దుర్వినియోగం కాకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న పౌరుల సమాచారంతోపాటు తాను సేకరించిన సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భద్రంగా ఉంచాల్సి ఉంది.
కానీ, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దీనిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ కంపెనీ ‘పోసిడెక్స్’కు అప్పగించింది. ఈ కంపెనీ గత ప్రభుత్వంలో ఐటీ శాఖలో కీలకంగా వ్యవహరించిన మీసేవ కమిషనర్ గౌరవల్లి వేంకటేశ్వర్ కుటుంబ సభ్యులది. ఆయన తల్లి గౌరవల్లి లీలాకుమారి, తమ్ముడు గౌరవల్లి వేణుగోపాల్ ఈ కంపెనీ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
కానీ, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈవో రాసిన లేఖలో కూడా ‘పోసిడెక్స్’ కంపెనీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. నిజానికి, అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని గత ప్రభుత్వం టి-యాప్ పేరుతో సేకరించింది.
టి-యాప్ సేకరించిన సమాచారంతోపాటు ఎన్నికల సంఘం నుంచి సేకరించిన ఓటరు సమాచారాన్ని పింఛనుదారుల వివరాలను రాబట్టడానికి కలిపిందని, ఈ ప్రక్రియంతా ప్రైవేటు కంపెనీ పోసిడెక్స్ ఆధ్వర్యంలో జరిగిందని తాజాగా ఎన్నికల సంఘం పేర్కొంది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం వెనక ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం కూడా ఉందని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో నిజం ఉందని తాజాగా ఈసీ ప్రకటనతో తెలుస్తోంది.
More Stories
బిసి రేజర్వేషన్లకై తెలంగాణ బంద్
పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 10 మంది మృతి
సత్యసాయి పోలీసుల అదుపులో మరి ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు