
ఈ చారిత్రక విజయంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పి. హర్షం వ్యక్తం చేశారు. “మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పరిరక్షణలో భారత్‌కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక ప్రతీక” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా భారత్‌పై ఉంచిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తోందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో మద్దతు తెలిపిన అన్ని సభ్య దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పదవీ కాలంలో మానవ హక్కుల పరిరక్షణ లక్ష్యాన్ని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణతో పాటు, వాటి ఉల్లంఘనలపై సమీక్ష జరపడంలో మానవ హక్కుల మండలి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన నాయకత్వ పటిమను మరోసారి చాటుకుంది.
More Stories
లండన్‌లోని ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్ఘాన్ సరిహద్దు.. కాల్పుల విరమణ
రహస్య పత్రాల లీక్‌లో భారత సంతతి రక్షణ వ్యూహకర్త అరెస్ట్