
నవంబర్‌లో బిహార్‌లో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేసింది. రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అభ్యర్థులు ఏదైనా ప్రకటనలను ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందడం తప్పనిసరి అని పేర్కొంది.
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను అందించాలని ఆదేశించింది. రాజకీయ ప్రకటనల కోసం ముందస్తు ధ్రువీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.
రాజకీయ ప్రచారాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. నిబంధనలను ఉల్లఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 75 రోజుల్లోపు ప్రచార ఖర్చుల పూర్తి వివరాలను రాజకీయ పార్టీలు సమర్పించాలని సూచించింది.
ఖర్చుల నివేదికలో ప్రకటనల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లకు చేసిన అన్ని చెల్లింపులు, అలాగే కంటెంట్ రూపొందించడం, ప్రచారం, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ కోసం అయ్యే ఖర్చులు తప్పనిసరిగా ఉండాలని రాజకీయ పార్టీలకు (ఈసీ) సూచించింది.
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు, ఆడియో సందేశాలు చేయరాదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్వర్క్లు, రేడియోల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని తెలిపింది. పోలింగ్ ప్రాంతంలో ఆడియో విజువల్ డిస్ప్లేలు నిషేధించినట్లు పోల్ ఆథారిటీ పేర్కొంది. బిహార్ నవంబర్ 6న మొదటి దశ పోలింగ్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈసీ నిర్ణయం తీసుకుంది.
More Stories
సీఎం ఫడణవీస్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మల్లోజుల
ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా పాక్ సైనికులు హతం
బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు మృతి