ఝార్ఖండ్ లో 32 మంది మావోయిస్టుల మృతి, 266 మంది అరెస్ట్

ఝార్ఖండ్ లో 32 మంది మావోయిస్టుల మృతి, 266 మంది అరెస్ట్
ఈ ఏడాది జనవరి 1 నుండి సెప్టెంబర్ చివరి వరకు జార్ఖండ్ లో భద్రతా దళాల ఆపరేషన్ లో మొత్తం 266 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని, 32 మంది మృతి చెందారని, మరో 30 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని  ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు ప్రాంతీయ కమిటీ సభ్యులు, ఒక జోనల్ కమాండర్, ఇద్దరు సబ్-జోనల్ కమాండర్లు, సిపిఐ(మావోయిస్ట్),  మరో తొమ్మిది మంది ఏరియా కమాండర్లు అరెస్టు అయిన వారిలో ఉన్నారని ఆయన చెప్పారు. 
 
ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టులల్లో సిపిఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యులు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ, అనుజ్ అలియాస్ సహదేవ్ సోరెన్ ఉన్నారని, ఇద్దరిపై రూ. 1 కోటి చొప్పున రివార్డు ఉందని తెలిపారు. మొత్తం 30 మంది నక్సలైట్లు, భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆయన చెప్పారు.  లొంగిపోయిన వారిలో జోనల్ కమాండర్ రవీంద్ర యాదవ్, సిపిఐ (మావోయిస్ట్) సబ్-జోనల్ కమాండర్ ఆనంద్ సింగ్, జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (జెజెఎంపి) సబ్-జోనల్ కమాండర్ లావ్లేష్ గంజు అలియాస్ లోకేష్ గంజు ఉన్నారని చెప్పారు. 

 
జనవరి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల నుండి దోచుకున్న 58 ఆయుధాలు, 11,950 కార్ట్రిడ్జ్‌లు, 18,884 డిటోనేటర్లు, 394.5 కిలోల పేలుడు పదార్థాలు, 228 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు (ఐఇడిలు) సహా 157 తుపాకులు స్వాధీనం చేసుకోవడంతోపాటు 37 మావోయిస్టు బంకర్లను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు.