ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కీలక ముందడుగు పడింది. టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో అవగాహన (ఎమ్ఓయూ) ఒప్పందం కుదుర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ \ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు.
విశాఖను కుత్రిమ మేధ (ఏఐ) సిటీగా మార్చేందుకు ఈ ఒప్పందం పునాది వేయనుంది. సుమారు 10 బిలియన్ డాలర్ల (రూ. 88,628 కోట్ల) పెట్టుబడితో 1 గిగావాట్ హైపర్ స్కిల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. `గూగుల్ ఏఐ హైపర్ స్కిల్ డేటా సెంటర్ ను ఏర్పాటు కానుంది. ఇది దేశంలోని తొలి కుత్రిమ మేధస్సు కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028- 2032 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి.
అంతేకాకుండా దాదాపు 1,88,220 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకోసిస్టమ్ మొత్తం మారిపోనుంది. వైజాగ్ ఏఐ సిటీగా మారిపోనుంది.
డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్‌ను లాంఛ్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్ – స్కేల్ డేటా సెంటర్‌ల రూపంలో మౌలిక సదుపాయాలు వికసిత్ భారత్‌కి దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
“గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ మారనుంది. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తాం. అమెరికా వెలుపల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. జెమినీ-ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంది. వచ్చే ఐదేళ్లల్లో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశం ఉంది. భారత్‌కే కాదు, విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీకి అవకాశం ఉంది” అని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ తెలిపారు.
“ప్రధాని మోదీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయి. నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను 2047కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న కల సాకారమవుతుంది. విజనరీ నాయకత్వం, దూరదృష్టితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయనేందుకు ఇదొక నిదర్శనం. సరైన నమయంలో సరైన నాయకులు వస్తే అభివృద్ధి వేగవంతమవుతుంది” అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంతోషం వ్యక్తం చేశారు.
More Stories
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసాల్లో సిట్ సోదాలు
14 ఏళ్ళ తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ క్షమాపణలు