జబల్పూర్‌ లో ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు

జబల్పూర్‌ లో ఆర్ఎస్ఎస్  కార్యకారిణి సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారత కార్యకారిణి సమావేశాలు సంఘ్ శతాబ్ది సంవత్సరంలో, అక్టోబర్ 30 నుండి నవంబర్ 1, వరకు మధ్యప్రదేశ్‌లోని మహాకౌశల్ ప్రాంత, జబల్పూర్‌ నగరంలో దీపావళి తర్వాత జరగనున్నాయి. అఖిల భారత కార్యకారిణిలో ప్రాంత సంఘచాలక్‌లు, 
కార్యవాహలు, ప్రాంత ప్రచారక్‌లు, అలాగే సంఘ్‌లోని 46 ప్రాంతాల నుండి సహ-ప్రాంత సంఘచాలక్‌లు, సహా కార్యవాహలు, సహా ప్రాంత ప్రచారక్‌లు పాల్గొంటారని అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, ఆరుగురు సహ-సర్ కార్యవాహులు, ఇతర అఖిల భారత కార్య విభాగ అధిపతులు, కార్యకారిణి  సభ్యులు పాల్గొంటారు. సంఘ్ శతాబ్ది సంవత్సరం ఇటీవల విజయదశమి శుభ సందర్భంగా నాగ్‌పూర్‌తో సహా దేశవ్యాప్తంగా జరిగిన ప్రత్యేక వేడుకలతో ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా సర్ సంఘచాలక్ ప్రసంగంలో ప్రస్థావించిన ముఖ్యమైన అంశాల తదుపరి చర్యలను సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో శతాబ్ది సంవత్సరానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు సంబంధించిన సన్నాహాలను కూడా సమీక్షిస్తారు. అన్ని ప్రాంతాల వారి శతాబ్ది ప్రణాళికలకు సంబంధించిన వివరణాత్మక నివేదికలు, వివరాల ప్రకటన చేస్తాయి. ప్రస్తుత సమస్యలపై హాజరైన కరకర్తల విస్తృత చర్చలు కూడా సమావేశంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి.

ఎప్పటిలాగే, 2025-26 సంవత్సరానికి వార్షిక ప్రణాళికను సమీక్షిస్తారు మరియు సంఘ్ పని విస్తరణకు సంబంధించిన నివేదిక లను కూడా తీసుకుంటారు. ఈ సమావేశంలో 2026 విజయదశమి నాటికి సంఘ్ శతాబ్ది కోసం నిర్దేశించిన సంస్థాగత లక్ష్యాలను ప్రత్యేకంగా చర్చిస్తారు.