
ఈజిప్ట్‌లోని షర్మ్-ఎల్ షేక్‌లో సోమవారం జరిగే గాజా శిఖరాగ్ర సమావేశానికి విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా, ఈజిప్ట్ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, అబ్దెల్ ఫతా అల్-సిసిలు దీనికి చివరి క్షణంలో ఆహ్వానించారు. అయితే మంత్రి కీర్తి వర్ధన్ హాజరవుతారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
గాజా స్ట్రిప్‌లో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన ఈ అంతర్జాతీయ సమావేశంకు ట్రంప్, అబ్దెల్ ఫతాలు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారని, ఇరవైకి పైగా దేశాల నేతలతోపాటు ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ దీనికి హాజరవుతున్నారని ఈజిప్ట్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి తెలిపారు. సోమవారం చర్చల అనంతరం హామాస్ చెరలో ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
వారి కోసం వేలాదిమంది కుటుంబ సభ్యులు టెల్ అవీవ్‌కు చేరుకుని ఎదురుచూస్తున్నారు. గాజాలో ధ్వంసమైన పట్టణాలు, నగరాలకు పాలస్తీనియన్లు తిరిగి వస్తున్నారు. రెండేండ్ల యుద్ధం తర్వాత గాజా నగరంలో బుల్డోజర్లు శిథిలాలను తొలగించడం ప్రారంభించాయి. 2023 అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయిల్ యుద్ధంలో కనీసం 67,682 మంది మరణించారు. 1,70,033 మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో ఇజ్రాయిల్‌లో మొత్తం 1,139 మంది మరణించారు . దాదాపు 200 మంది బందీలుగా పట్టుబడ్డారు.
More Stories
`గాజా శాంతి ఒప్పందం’కు మోదీకి ట్రంప్ ఆహ్వానం?
25 పాక్ ఆర్మీ పోస్టుల స్వాధీనం.. 58 మంది సైనికుల హతం!
ఆఫ్ఘన్ సరిహద్దులో 12 మంది పాక్ సైనికుల మృతి