
కాలిఫోర్నియాలో దీపావళి పండుగకు అధికారిక గౌరవం లభించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ ఇటీవల ఒక చట్టంపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర ప్రత్యేక దినంగా ప్రకటించారు. ఈ మేరకు చట్టంపై ఆయన సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం, ఇకపై కాలిఫోర్నియాలో ప్రభుత్వ ఉద్యోగులు దీపావళి రోజున వేతనంతో సెలవు పొందేందుకు అర్హత సాధిస్తారు.
పెన్సిల్వేనియా (2024), కనెక్టికట్ (2025) తర్వాత, కాలిఫోర్నియా ఇప్పుడు అమెరికాలో అలా చేసిన మూడవ రాష్ట్రం అయింది. ఈ చట్టం ‘అసెంబ్లీ బిల్ 268’ రూపంలో ఆమోదం పొందింది. ఈ నిర్ణయంతో కాలిఫోర్నియాలోని దక్షిణాసియావాసుల, ముఖ్యంగా ప్రవాస భారతీయుల సంస్కృతికి గౌరవం లభించింది. ఈ చట్టం విద్యాసంస్థలపైన కూడా ప్రభావం చూపించనుంది.
కాలిఫోర్నియాలోని ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి పండుగ గురించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. కొంతమంది ఉద్యోగులకు కూడా వేతనంతో సెలవు పొందడానికి వీలు కల్పిస్తుంది. 2025 ప్యూ సర్వే ప్రకారం, అమెరికాలోని భారతీయ జనాభాలో 960,000 మంది (4.9 మిలియన్లు) కాలిఫోర్నియాలో నివసిస్తున్నారని పరిగణనలోకి తీసుకుని, భారతీయ సంతతికి చెందిన శాన్ జోస్‌లోని డెమొక్రాట్ అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా శాన్, డియాగోకు చెందిన దర్శన పటేల్‌తో కలిసి ఈ బిల్లుపై ఒత్తిడి చేశారు.
ఈ చట్టం ద్వారా ప్రవాస భారతీయుల సంస్కృతిక చరిత్రకు మరింత గుర్తింపు లభించిందంటూ సిలికాన్ వ్యాలీ పారిశ్రామికవేత్త, మాజీ అధ్యక్షుడు బిడెన్ సలహాదారుడు అజయ్ భుటోరియా స్వాగతించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళికి అధికారిక గుర్తింపునివ్వడం కాలిఫోర్నియా సమ్మిళిత స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ చట్టం వల్ల భారతీయ కుటుంబాలు తమ సంప్రదాయాలను ఆనందంగా, పనిచేయకుండానే జరుపుకునే అవకాశం కలుగుతుందని భుటోరియా పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి దక్షిణ కాలిఫోర్నియా వరకు, భారతీయ సమాజం అమెరికా అభివృద్ధిలో కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న ఈ సందర్భంగా ఈ చట్టం ప్రవాస భారతీయులకి ఇచ్చిన గౌరవం అని భావిస్తున్నారు.
విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా ఈ నిర్ణయాన్ని ప్రశంసించింది. దీనిని “హిందూ అమెరికన్లకు గర్వకారణమైన, చారిత్రాత్మక మైలురాయి” అని అభివర్ణించింది. ఈ బిల్లును ఆమోదించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం “సాంస్కృతిక అవగాహన పౌర నిశ్చితార్థాన్ని కలిసినప్పుడు, అది ప్రతి ఒక్కరినీ సుసంపన్నం చేస్తుందని చూపిస్తుంది” అని తెలిపింది. గవర్నర్ గవిన్ న్యూసమ్, కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీకి ఈ బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఇది ఇతర రాష్ట్రాలను “ఆలోచనాత్మక ఉదాహరణ”ను అనుసరించమని ప్రోత్సహించింది.
More Stories
భారత్ తో సంబంధాలు వెంటనే సరిదిద్దండి
మిలిటెంట్లు దాడిలో 11 మంది పాక్ సైనికులు మృతి
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్