
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది. ఈ కమిటీ ద్వారా ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రత్యేకంగా చర్చలు జరిపాయి.
ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు
ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను పూర్తిచేసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా రాంచందర్ రావు ముఖ్య నాయకులతో సమావేశమై అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
త్వరలోనే అధికారికంగా బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, సమీకృత ప్రక్రియ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడంపై దృష్టి పెట్టింది.
More Stories
`దున్నపోతు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలు
అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా సమ్మక్క, సారక్క యూనివర్సిటీ
మహిళల చైతన్యం కోసం సప్త శక్తి సంగం