
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై షూ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. భారత సీజేఐపై దాడికి యత్నించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సీజేఐతో మాట్లాడారు. అనంతరం మన సమాజంలో ఇలాంటి అనైతికమైన చర్యలకు తావు లేదని స్పష్టం చేస్తూ ప్రధాని ఎక్స్ పోస్ట్ పెట్టారు.
“భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌తో మాట్లాడాను. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. ఇలాంటి అనైతికమైన.. ఆమోదయోగ్యంకాని చర్యలకు మన సమాజంలో చోటు లేదు. సీజేఐపై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని మోదీ తన ట్వీట్లో వెల్లడించారు.
సుప్రీంకోర్టు ఆవరణలో సోమవారం ఉదయం ఒక కేసు విచారణ సమయలో 72 ఏళ్ల లాయర్ రాకేశ్ కిశోర్ సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించారు. ఆయనను గమనించిన తోటి లాయర్లు అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది ఆయనను బయటకు తీసుకెళ్తుండగా సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని భారత్ సహించదు అని గట్టిగా అరిచారు. అయితే.. తనపై దాడి ప్రయత్నం జరిగినా అదేమీ పట్టదన్నట్టుగా తన పనిలో తాను నిమగ్నమయ్యారు సీజేఐ.
More Stories
మావోయిస్టుల్లో మల్లోజుల రాజీనామా ముసలం
శబరిమలలో బంగారం గల్లంతుపై సీబీఐ దర్యాప్తు… బీజేపీ
బీహార్ ఎన్నికల్లో కొత్తగా 17 సంస్కరణలు