
ఆ తర్వాత సెబాస్టియన్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాజకీయ పార్టీలతో వారాల తరబడి సంప్రదింపులు జరిపిన అనంతరం ఆదివారం తన మంత్రివర్గాన్ని కూడా నియమించారు. సోమవారం మంత్రివర్గం తొలి సమావేశం కూడా నిర్వహించనుంది. మంత్రివర్గాన్ని నియమించిన గంటల వ్యవధిలోనే ప్రధాని సెబాస్టియన్ రాజీనామా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆయన రాజీనామాను ఆమోదించారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సెబాస్టియన్ లెకోర్న్ కేబినెట్ ఎంపికపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్త మయ్యాయి. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి బ్రూనో లెమైర్‌ను రక్షణ మంత్రిగా తిరిగి తీసుకోవాలనే ఆయన నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర కీలక పదవుల్లో పెద్దగా మార్పులు ప్రకటించలేదు.
కాగా, గత రెండేళ్లలో ఫ్రాన్స్‌లో రెండుసార్లు తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. ఫ్రాన్స్ పార్లమెంట్‌లో ప్రధాని విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రధాని నియామకం మాక్రన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఆయన వద్ద రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.
కొత్త ప్రధానిని నియమించడం లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే. గత రెండేళ్ల నుంచి ఇదే సమస్య వస్తున్నా ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం దేశాధ్యక్షుడు మొగ్గు చూపలేదు. ఒకవేళ ఈసారి ఎన్నికలకు వెళ్తే, ప్రభుత్వాన్ని రద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధాని వ్యక్తిని అధ్యక్షుడు నియమిస్తారు.
More Stories
సొంత ప్రజలపైనే బాంబులు వేసే దేశం పాకిస్తాన్
పాక్ టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్ పై ఐసీసీ చర్యలు
అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య