జ‌పాన్ తొలి మ‌హిళా ప్ర‌ధానిగా స‌నాయి త‌కాయిచి!

జ‌పాన్ తొలి మ‌హిళా ప్ర‌ధానిగా స‌నాయి త‌కాయిచి!
జ‌పాన్ దేశానికి తొలిసారి ఓ మ‌హిళ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న క‌న్జ‌ర్వేటివ్ పార్టీ స‌నాయి త‌కాయిచిని కొత్త నేత‌గా ఎన్నుకున్నారు. దీంతో 64 ఏళ్ల ఆ మ‌హిళ‌ జ‌పాన్ ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యే అవకాశాలు ఉన్నాయి.  ఈమె గతంలో మాజీ ఆర్థిక భద్రతామంత్రిగా పనిచేశారు.  గ‌త కొన్నాళ్లుగా క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో లుక‌లుక‌లు ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న ఆ పార్టీని ఏకీకృతం చేసేందుకు ఆమె తీవ్ర ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు.
ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాని షిగేరు ఇషిబా త్వ‌ర‌లో త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు గ‌త నెల‌లో ప్ర‌క‌టించారు.  పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న ఆ పార్టీలో ప్రధానిగా మహిళను ఎన్నుకోవడం ఒక అరుదైన ఘటనగానే చెప్పుకోవచ్చు. శనివారం ఎల్‌డిపి నిర్వహించిన అంతర్గత ఓటింగ్‌లో తకైచి ప్రముఖ మాజీ ప్రధానమంత్రి జునిచిరో కొయిజుమి కుమారుడు, వ్యవసాయ మంత్రి షింజిరో కొయిజుమిని ఓడించారు. 
దీంతో ప్రస్తుత ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా స్థానంలో తకైచి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.  క‌న్జ‌ర్వేటివ్ నేత త‌కాయిచికి బ్రిట‌న్ మాజీ తొలి మ‌హిళా ప్ర‌ధాని మార్గ‌రేట్ థాచ‌ర్‌ను ప్రేర‌ణ‌గా పొందారు. ఐర‌న్ లేడీ అన్న ఆశ‌యాన్ని పూర్తి చేసేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లు భావిస్తున్నారు. సేమ్ సెక్స్ మ్యారేజీల‌ను త‌కాయిచి వ్య‌తిరేకించారు. మాజీ ప్ర‌ధాని షింజో అబే బాట‌లో ఆమె న‌డ‌వాల‌నుకుంటున్నారు. అబే ఆర్థిక విజ‌న్‌కు మ‌ళ్లీ జీవం పోయాల‌ని ఆమె ఆశిస్తున్నారు. జ‌పాన్ రాజ్యాంగాన్ని రివైజ్ చేయాల‌ని కూడా ఆమె భావిస్తున్నారు.