
దేశద్రోహం లాంటి చట్టాలను సాధారణంగా ప్రతిఘటనను అణిచేసేందుకు ప్రయోగిస్తుంటారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. స్వతంత్ర భారతంలో దేశద్రోహ చట్టాలు, అమెరికాలో బానిస చట్టం, వలస భారతంలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ల మధ్య పోలికలను చెబుతూ కేవలం చట్టబద్ధం చేసినంత మాత్రానే ప్రతిదీ న్యాయబద్ధమైనది కాబోదని, ఇతరాత్ర విషయాలను కూడా క్షుణ్ణంగా పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందని సూచించారు.
మారిషస్‌లో శుక్రవారం మారిస్ రోల్ట్ స్మారక ఉపన్యాసం-2025 ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ ప్రసంగిస్తూ ఏకపక్ష ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా రాజ్యాంగ విలువలు, వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ సాగిస్తున్న కృషిని ప్రస్తావించారు. భారతీయ న్యాయవ్యవస్థ చట్టాల పునాదిపై ఏర్పడిందని, బుల్డోజర్ చట్టాల ఆధారంగా కాదని స్పష్టం చేశారు.
“ఒకటి చట్టబద్ధం చేసినంత మాత్రాన అది న్యాయమైనదని అర్థం కాదు. దీన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. చేదైన ఈ వాస్తవం గరించి చరిత్ర మనకు అనేక ఉదాహరణలు ఇస్తుంది. ఉదాహరణకు బానిసత్వమనేది ఒకప్పుడు అమెరికా సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చట్టబద్ధమైనది” అని గుర్తు చేసారు.
“అలాగే భారత్‌లో ఇలాంటి వలసకాలం నాటి చట్టాలు అనేకమున్నాయి. వాటిలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, 1871 ఒకటి.దాని ప్రకారం పుట్టుకతోనే ఆ తెగల్లో, కమ్యూనిటీల్లో పుట్టిన వారందరూ నేరస్తులేనని చట్టం ముద్ర వేస్తుంది. ఆదిమ వాసులను, సమాజంలో పక్కకు నెట్టబడిన కొన్ని కమ్యూనిటీల పట్ల వ్యవస్థాగతమైన అన్యాయాలను చూపిస్తూ శిక్షిస్తున్న చట్టాలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వున్నాయి. దేశ ద్రోహ చట్టాలను తరచుగా ప్రతిఘటనను అణచివేయడానికి ఉపయోగిస్తూ వుంటారు: అని జస్టిస్ గవారు వ్యాఖ్యానించారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలన అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ కేవలం చట్టబద్ధమైనది ఏమిటి, న్యాయమైనది, నిష్పాక్షికమైనది ఏమిటి అనే రెండు అంశాల మధ్య తేడాను భారత రాజ్యాంగం చక్కగా నొక్కి చెప్పిందని చెప్పారు. ప్రాధమిక హక్కుల అమలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు భారత రాజ్యాంగంలోని 32వ అధికరణ హామీ కల్పిస్తోందని, ఇది రాజ్యాంగానికి గుండెకాయ వంటిదని ఆయన వ్యాఖ్యానించారు.
చట్టం అనేది న్యాయాన్ని అందచేయాలి, దాడులకు గురయ్యే వారికి రక్షణ కల్పించాలి అనే సూత్రాన్ని ఈ అధికరణలో పొందుపరిచారు. అలాగే అధికారాన్ని బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించాలని కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ రంగంలో చట్టబద్ధ పాలన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
More Stories
ట్రంప్ హెచ్చరికతో బందీలను విడుదలహమాస్ అంగీకారం
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు