
శత్రువులు ఎక్కడో ఉండర్రా.. కూతుళ్లు , చెల్లెళ్లే రూపంలో మన ఇంట్లోనే ఉంటారు అని.. ఓ సినిమాలో డైలాగ్ రాజకీయాలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు బీహార్‌లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇదే రాజకీయం నడుస్తోంది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు.
ట్విట్టర్లో ఆర్జేడీని, తేజస్వీని అన్ ఫాలో అయ్యారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆర్జేడీ కంగారు పడిపోతోంది. లాలూ వారసుల్లో ఇద్దరు కుమారులే మొదట రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత రోహిణి ఆచార్య వచ్చారు. లాలూ కిడ్నీ సమస్యతో చావుబతుకుల్లో ఉన్నప్పుడు రోహిణి ఆచార్య తన కిడ్నీని దానం చేసి వార్తల్లోకి వచ్చారు. తండ్రిని బతికించుకున్నారు. రాజకీయాలపై ఆసక్తి లేని ఆమె ఆ తర్వాత రాజకీయంగా కీలకం అయ్యారు.
గత లోక్ సభ ఎన్నికల్లో లాలూ ఎప్పుడూ పోటీ చేసే సీటు నుంచి పోటీ చేసినా బీజేపీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఇంకా యాక్టివ్ అయ్యారు. తేజస్వి పార్టీలో తన సోదరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సంజయ్ యాదవ్ అనే ఎంపీ, స్ట్రాటజిస్ట్ కే ప్రాధాన్యం లభిస్తుంది. దాంతో ఆమె అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే తేజస్వి అన్న తేజ్ ప్రతాప్ సొంత పార్టీ పెట్టుకున్నారు.
ఆయన కూడా సోదిర రోహిణి ఆచార్యకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన కొత్త పార్టీకి జన్‌శక్తి జనతా దళ్ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తన పార్టీ ఎన్నికల గుర్తుగా బ్లాక్ బోర్డు ఉంటుందని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తేజ్ ప్రతాప్ తెలిపారు. 2015లో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు.
కాగా కొన్ని నెలల క్రితం తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ పార్టీ నుంచి, కుటుంబం నుంచి లాలూప్రసాద్ యాదవ్ బహిష్కరించారు. తాను 12 ఏళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడంతో లాలూ కుటుంబంలో చిచ్చురేగింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక లాలూ ప్రసాద్ చూస్తూండిపోతున్నారు. కుమార్తె , కుమారుల మధ్య రాజీ చేయడం లేదు. దాంతో రోహిణి ఆచార్య వ్యవహారం బీజేపీకి అనుకూలంగా మారుతుంది.
More Stories
అలహాబాద్ హైకోర్టులో రాహుల్‌గాంధీకి చుక్కెదురు
లేహ్ ఉద్యమకారుడు వాంగ్‌చుక్ అరెస్ట్
సోనమ్ వాంగ్ చుక్ సంస్థ ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ రద్దు