
హెడ్రోజన్ భవిష్యత్ ఇంధనమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఇంధన భద్రత, ఆర్థిక పోటీతత్వం, పర్యావరణ బాధ్యతకు కీలకమైన స్తంభంగా చెబుతూ 2030 నాటికి భారత్ ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చెప్పారు. దీనికి బలమైన విధానంతో పాటు రూ.19,700 కోట్ల విలువైన ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం మద్దతు ఇస్తుందని తెలిపారు.
బయోఫ్యూయల్ బ్లెండింగ్‌ను స్వీకరించడం ద్వారా సాధించిన విజయాలని ప్రస్తావిస్తూ 2020 నాటికి 10 శాతం బయోఫ్యూయల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని, తాము ఐదు నెలల ముందుగానే లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. అప్పుడు 20శాతం బయోఫ్యూయల్ బ్లెండింగ్‌ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయన్న ఆయన తొలి లక్ష్యాన్ని ఐదు నెలల ముందుగానే సాధిస్తే రెండో లక్ష్యాన్ని ఆరేళ్ల ముందుగానే సాధించామని చెప్పారు.
More Stories
సోనమ్ వాంగ్ చుక్ సంస్థ ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ రద్దు
రూ. 62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు
షారూక్ ఖాన్‌పై సమీర్ వాంఖడే పరువునష్టం కేసు