ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజా సినిమా ఓజీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఇచ్చిన అనుమతులను హైకోర్టు తాజాగా రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి. దీనికి సంబంధించి టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.
ఈ క్రమంలోనే సందిగ్ధం నెలకొంది. ఓజీ సినిమా విడుదల క్రమంలో టికెట్ ధరలను పెంచాలని కోరుతూ సినిమా నిర్మాతలు సంస్థ ప్రభుత్వాన్ని కోరగా, అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మెమోను సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సీఎస్‌కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందని పేర్కొన్నారు.
టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందన్న అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఈ వాదనలను పరిగణనలో తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీచేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.
కాగా, సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షోల టికెట్ ధరను రూ.800 (జీఎస్టీతో సహా)గా నిర్ణయించారు. ఇక తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 (జీఎస్టీతో సహా) టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ అనుమతులనే తాజాగా కోర్టు రద్దు చేసింది.
More Stories
ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణాలో బిజెపిని ఆపలేరు
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయండి
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం దక్షిణ తెలంగాణకు శాపం!