
ఖైబర్ ఫక్తునఖ్వా ప్రావిన్సులో ఓ గ్రామంపై పాకిస్థాన్ వైమానిక దళం దాడి చేసింది. ఆ దాడిలో సుమారు 30 మంది గ్రామస్థులు మరణించినట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడిజరిగినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్ యుద్ధ విమానాలు 8 ఎల్ఎస్-6 బాంబులను తిరహ్ లోయలో ఉన్న మాత్రే దారా గ్రామంపై జార విడిచింది.
ఆ బాంబుల వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొన్నారు. బాంబులు జారవిడిచిన ప్రాంతం నుంచి అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా హృదయవిదారకర పరిస్థితి అక్కడ ఉన్నది. చిన్నారుల మృతదేహాలను కూడా పడి ఉన్నట్లు గుర్తించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఖైబర్ ప్రావిన్సులో కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలను నిర్వహించారు. అనేక మంది పౌరులు అక్కడ ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. పాకిస్థాన్‌లో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి.
పాకిస్థాన్ ఇన్స్‌టిటయూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూర్టీ స్టడీస్ నివేదిక ప్రకారం ఉగ్ర దాడులు 42 శాతం పెరిగాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 74 సార్లు ఉగ్రదాడి జరిగినట్లు డేటా చెబుతున్నారు. వాటిల్లో 90 మంది మరణించారు. అయితే ఉగ్రవాద ప్రభావిత ప్రావిన్సుల్లో ఖైబర్ ఫక్తున్‌ఖ్వా మొదటి స్థానంలో, బలోచిస్తాన్ రెండో స్థానంలో ఉన్నాయి.
More Stories
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ మళ్ళీ మొదలు కావచ్చు