
జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని,. జీఎస్టీ పొదుపు పండుగ లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. “రేపటి నుంచి నవరాత్రి ప్రారంభమవుతుంది. నవరాత్రి మొదటి రోజు నుంచి ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశం అడుగులు వేస్తుంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణ అమలవుతాయి. రేపటి నుంచి ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభమవుతుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైంది” అని చెప్పారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
ఆదివారం జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు ‘నాగరిక దేవో భవ’ను ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. కాగా, జీఎస్టీ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. పెట్టుబడి, పొదుపుతో పాటు ఆనందాన్ని పెంచుతుందని చెప్పారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపు, జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేస్తాయని పేర్కొన్నారు.
“ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయి. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తాయి. దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయి” అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో దేశంలో రకరకాల పేర్లతో ఎన్నో పన్నులు ఉండేవని, రకరకాల పన్నులతో ప్రజలు అయోమయానికి గురయ్యేవారని పేర్కొంటూ అన్నిరకాల పన్నులను రద్దు చేసి 2017లో జీఎస్టీ తీసుకువచ్చామని ప్రధాని గుర్తు చేశారు. 2017లో జీఎస్టీ సంస్కరణ ప్రారంభించినప్పుడు పాత చరిత్రను అది మార్చిందని, ప్రస్తుత జీఎస్టీ సంస్కరణలు కొత్త చరిత్ర సృష్టించడానికి నాంది పలికిందని ఆయన చెప్పారు.
మరోవైపు జీఎస్టీ సంస్కరణల వల్ల సంక్లిష్టమైన పన్నుల నుంచి వినియోగదారులు విముక్తి పొందారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రతిరోజూ అవసరమైన వస్తువులు పన్ను రహితంగా లేదా 5 శాతం లేదా 18 శాతం జీఎస్టీ కింద ఉంటాయని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాంజాగా అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలతోపాటు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు.
“స్వదేశీ శ్రేయస్సును పెంచుతుంది. భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి. ప్రతి ఇల్లు, షాపు స్వదేశీని సూచించాలి. ఇది జరిగినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది” అని మోదీ తెలిపారు. ప్రస్తుత పండగల సమయంలో దేశంలోని అందరికీ మేలు జరుగుతుందని చెబుతూ జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆత్మనిర్భరత వైపు అడుగులు పడతాయని, పేర్కొన్నారు. రాష్ట్రాలు, దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
“రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రాంభం కాబోతోంది. కొత్త చరిత్ర ప్రారంభమవుతోంది. జీఎస్టీ మార్పులతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సోమవారం నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్ రేట్లు అమలులోకి రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయి. దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధి రేటుకు మరింత ఊతమిస్తాయి” అని ప్రధాని వివరించారు.
“దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చాం. రేపటి నుంచి కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. ప్రజల పొదుపు పెరుగుతుంది” అని ప్రధాని మోదీ తెలిపారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు