
స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్రీయ కార్యవర్గ కమిటీ రెండు రోజుల సమావేశాలు ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వద్ద శనివారం చాలా ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా స్వదేశీ ఉత్పత్తులు, స్వావలంబన, స్థానిక ఆర్థిక శక్తిని బలోపేతం చేసే ఆలోచనలు గురించి చర్చలు జరుగుతున్నాయి. స్వదేశీ తత్వాన్ని దేశవ్యాప్తంగా మరింత విస్తరించడానికి స్పష్టమైన దిశను అందించేందుకు సమాలోచనలు జరుపుతున్నారు.
భారత దేశపు ఆర్థిక స్వావలంబన, స్వదేశీ ఆధారిత అభివృద్ధిపై చర్చలు, సామాజిక, ఆధ్యాత్మిక సామరస్యం, యువతలో స్వదేశీ స్పృహను పెంపొందించడం సమావేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ సమావేశాలలో వివిధ రాష్ట్రాల నుండి 95 మంది ప్రతినిధులు హాజరయ్యారు. స్వదేశీ జగరన్ మంచ్ జాతీయ కన్వీనర్ సి.ఎ. ఆర్. సుందరం, నేషనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కాశ్మీర్ లాల్, నేషనల్ సహ-నిర్వాహక కార్యదర్శ సతీష్ కుమార్ పలు కీలక సమస్యలను ప్రస్తావించారు.
స్వదేశీ జాగరణ్ మంచ్ సౌత్ జోన్ కన్వీనర్ డా. ఎస్ లింగమూర్తి రచన “స్వదేశీ-ఆత్మశక్తి” గ్రంధాన్ని సంయుక్తంగా జాతీయ కన్వీనర్ సుందరం, కాశ్మీర్ లాల్, సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం స్వదేశీ ఎందుకు అనేదానికి సమగ్ర సమాధానాలను అందిస్తుంది. స్వదేశీ ప్రాముఖ్యత, దానిని ఒక వ్యక్తి నుండి జాతీయ స్థాయి వరకు ఎలా సాధన చేయవచ్చు అని వివరణ ఇస్తూ భారతదేశ ఆర్థిక ఆత్మవిశ్వాసానికి ప్రేరణగా పనిచేస్తోందని వారు అభినందించారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే