భారత్ లోని పలు కీలక విమానాశ్రయాలపై జరిగిన భారీ సైబర్ దాడితో విమానయాన సేవలు అస్తవ్యస్తగా మారాయి. లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ దాడి ప్రభావానికి వేలాదిమంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన ఆన్ లైన్ వ్యవస్థలు కుప్పకూలడంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేశారు.
సైబర్ నేరగాళ్లు విమానాశ్రయాల సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్-ఇన్, బోర్డింగ్ వంటి ముఖ్యమైన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా బ్రస్సెల్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్ లు పూర్తిగా పనిచేయడం లేదని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సైబర్ దాడి కారణంగా విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ప్రయాణికులు తమ విమాన సర్వీసుల తాజా సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థల వెబ్సైట్లను పరిశీలించాలని అధికారులు సూచించారు. దీనిపై అధికారులు స్పంక్షిస్తూ ‘మా సాంకేతిక సిస్టమ్ లను పునరుద్ధరించేందుకు నిరంతరం పనిచేస్తున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
కాగా, అగ్రరాజ్యం అమెరికాలో కూడా టెలికాం సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా డల్లాస్ సహా పలు ఎయిర్‌పోర్ట్స్‌లో దాదాపు 1,800కిపైగా విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. వందలాది విమానాలు రద్దయ్యాయి. ఎఫ్‌ఏఏతో సంబంధం లేని స్థానిక టెలిఫోన్ కంపెనీ పరికరాల్లో సమస్య కారణంగా సమస్య తలెత్తినట్లు ఎఫ్‌ఏఏ తెలిపింది. సమస్యను గుర్తించేందుకు టెలిఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. సాంకేతిక సమస్య కారణంగా డల్లాస్‌లో 20 శాతం విమానాలు రద్దైనట్లు ఫ్లైట్‌అవేర్ తెలిపింది.
More Stories
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్
25 శాతం అదనపు సుంకాలను అమెరికా తొలగించే అవకాశం