
* ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ని కలిసినందుకు అభినందించిన నాటి ప్రధాని
పాకిస్థాన్ లో 2006లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను కలిసి మాట్లాడినందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు కృతజ్ఞతలు చెప్పారని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ వెల్లడించాయిరు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయ్యి, జీవితకాలం జైలు శిక్షతో ప్రస్తుతం జైల్లో ఉన్న మాలిక్ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
నాడు హఫీజ్‌తో సమావేశం అనంతరం తాను ఢిల్లీకి తిరిగిరాగానే అప్పటి జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్ సమక్షంలో తాను నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ను కలిసి వివరాలను తెలిపానని మాలిక్ పేర్కొన్నారు. అనంతరం మన్మోహన్ సింగ్ దేశంలో శాంతి కోసం ఉగ్రవాదులను కలిసినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించారు. తనను “కాశ్మీర్‌లో అహింసా ఉద్యమ పితామహుడు” అని కూడా అభివర్ణించారని మాలిక్ ఆరోపించారు.
ఇది తన చర్యలకు ప్రభుత్వ అనుమతిని చూపిస్తుందని, తాను స్వతంత్రంగా ఉగ్రవాదులతో సంబంధాలు కోరాడనే ఆరోపణలను తోసిపుచ్చారని మాలిక్ చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఉగ్రవాదిను విడిగా కలిశానని తనపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని చెప్పారు. నాడు తాను భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సూచన మేరకు మాత్రమే దేశంలో శాంతి కోసమే హఫీజ్‌ను కలిశానని మాలిక్ స్పష్టం చేశారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు