మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
 
ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమాల్లో భాగంగా, ఉప్పల్‌లోని సంజన కాంప్లెక్స్‌లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు  డా.శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో “క్యాన్సర్ అవేర్‌నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్” ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 
 
మొదటి దశలో స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైతే తదుపరి పరీక్షలు, చికిత్స వరకు పూర్తి వైద్య సహాయం అందిస్తున్నారు హైదరాబాద్ నగరం దేశంలో రెండో స్థానంలో అత్యధిక క్యాన్సర్ కేసులు ఉన్న నగరంగా నిలిచిన నేపథ్యంలో, ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని భావిస్తున్నారు. ఈ శిబిరం ద్వారా ప్రజలకు ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తింపు, సమయానుకూల చికిత్స, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించడం, అలాగే క్యాన్సర్ కేసులను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు డా. శిల్పా రెడ్డి తెలిపారు.

కాగా, ప్రధాని మోదీ జన్మదిన వేడుకలలో భాగంగా చార్మినార్ నియోజకవర్గంలోని హుస్సేని ఆలం ప్రాంతంలో ఉన్న ఆర్ హెచ్ వి కాన్సెప్ట్ స్కూల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.  అనంతరం విద్యార్థులతో ముఖాముఖి ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించి, వారిలో సేవా భావన, విద్యాపట్ల కట్టుబాటు , సమాజ పట్ల బాధ్యత గల పౌరులుగా ఎదగాలనే సందేశాన్ని ఇచ్చారు.
ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ ఉమామహేందర్ గారు, శ్రీ పాండు యాదవ్, శ్రీమతి మేఘ రాణి, మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువ విద్యార్థుల్లో సేవా దృక్పథం, సామాజిక బాధ్యత, మరియు దేశభక్తి విలువలు నాటిపెట్టే ప్రయత్నం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.