బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యమేనని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. దేశానికి సేవ చేయాలంటే త్రివిధ దళాలల్లో చేరాలని విద్యార్థులకు సూచించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ, అవకాశం వస్తే మరింత కఠినమైన దాడి జరుగుతుందని స్పష్టం చేశారు. ఝార్ఖండ్ పర్యటనకు వచ్చిన సీడీఎస్ అనిల్ చౌహాన్ గురువారం రాజ్‌భవన్‌లో స్కూల్ విద్యార్థులతో ముచ్చడిస్తూ “బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ఫౌజ్ (సైన్యం). మీరు దేశానికి సేవ చేయాలనుకుంటే, దేశంతో పాటు ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే మీరు సాయుధ దళాలలో చేరాలని ఆకాంక్షించాలి” అని ఆయన ఆహ్వానించారు.
“ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల ఘటనలు చాలా జరిగాయి. ఈ క్రమంలోనే రెస్క్యూ ఆపరేషన్లలో అనేక మందిని రక్షించేందుకు సైన్యం తీవ్రంగా కృషి చేసింది” అని జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. సైన్యం ఎప్పుడూ దేశానికి నష్టం కలగకుండా కాపాడడమే ధ్యేయం అని పేర్కొంటూ 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక ఆపరేషన్ సిందూర్ గురించి సీడీఎస్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ మే 7న అర్ధరాత్రి శత్రు స్థావరాలపై ఒంటి గంటకు తొలి దాడిని నిర్వహించినట్లు తెలిపారు. ‘సాధారణంగా తెల్లవారుజామున దాడులు జరుగుతాయి, కానీ ఆ సమయంలో ప్రజలు కదికలు ఉంటాయి. అప్పుడు దాడి జరిగే అమాయక ప్రజలు ప్రాణ నష్టం జరిగేది. అందుకే రాత్రి సమయంలోనే దాడి నిర్వహించాం’ అని చెప్పారు.
“దాడికి ముందు పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ కదలికలను పర్యవేక్షించాం. సైన్యం, వైమాళిక దళం చెరో ఏడు లక్ష్యాలను ధ్వంసం చేశాయి. నావిక దళం కూడా ఇందులో పాల్గొంది. ఇది ఉరి, బాలాకోట్ దాడుల కంటే భిన్నం” అని వివరించారు. రాత్రి వేళలో సుదూర లక్ష్యాలపై కచ్చిమైన దాడులు చేయడానికి ప్రత్యేక కృషి అవసరమని అనిల్ చౌహాన్ తెలిపారు.
“ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన ప్రతి దాడిలోనూ పాకిస్థాన్‌ను నిర్ణయాత్మకంగా ఓడించాం. పహల్గాం దాడి తర్వాత టీఆర్ఎఫ్ అనే ఉగ్రసంస్థ బాధ్యత వహించింది. ఆ లింక్‌ను సోషల్ మీడియా నుంచి తొలిగించింది. ఉగ్రవాదులు సర్జల్ గ్రామం నుంచి ప్రవేశించారని దర్యాప్తులో తేలింది” అని చెప్పారు. వారు కశ్మీరీలు కాకుండా పాకిస్థాన్ భాష మాట్లాడారని, ఈ ఆధారాల ఆధారంగా టార్గెట్ నిర్ణయించామని వెల్లడించారు సాంకేతికత ద్వారా నడిచే యుద్ధం ఇప్పుడు సైబర్ వంటి కొత్త రంగాలకు విస్తరించిందని జనరల్ చౌహాన్ పేర్కొన్నారు.
More Stories
గగన్‌యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో
ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించటం అసాధ్యం
అన్ని మతాలను గౌరవిస్తాను