
చదువులు, జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన కొంతమంది భారతీయులు చివరికి రష్యా సైన్యంలో చేరుతున్నారు. రష్యా తరఫున యుద్ధంలో ఉక్రెయిన్ తో పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది చదువు కోసం రష్యాకు వెళ్లి పంజాబ్, రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులు ఇప్పుడు ఉక్రెయిన్ తరఫున యుద్ధంలో పాల్గొంటున్నారు.
ఈ పరిస్థితి నుంచి తమను రక్షించాలని కోరుతూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ కుమారుడిని ఎలాగైన స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. రాజస్థాన్లోని బికనేర్ కి చెందిన అజయ్ అనే యువకుడు చదువు కోసం రష్యాకు వెళ్లాడు. అక్కడ నుంచి బలవంతంగా ఉక్రెయిన్ తో జరపుతున్న యుద్ధానికి పంపారని అజయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తన కుమారుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రజేంద్ర ముండ్ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు, అజయ్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లుంకరంసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జున్సర్ గ్రామానికి చెందిన అజయ్ 2024 నవంబర్ లో చదువు కోసం రష్యా వెళ్లాడు.
తనను రష్యా సైన్యంలోకి చేర్చారని పరిస్థితిని గురించి వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వైరల్ అయిన వీడియోలో త్వరగా తనను రక్షించమని ప్రభుత్వానికి వేడుకుంటున్నాడు. “నన్ను మోసం చేసి రష్యన్ ఆర్మీలో చేర్పించి సరిహద్దుకు పంపించారు. నేను ఇక్కడకు చదువు, ఉద్యోగం కోసం వచ్చాను. కానీ ఇప్పుడు మరణ భయంతో జీవించాల్సి వస్తోంది. భారత్‌కి చెందిన మరికొంతమంది యువకులు కూడా ఇక్కడ ఇరుక్కున్నారు. వారిలో ఒకరు ఇప్పటికే చనిపోయారు” అంటూ అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పంజాబ్కు చెందిన మరో యువకుడి పరిస్థితి కూడా ఇలానే ఉంది. చదువు కోసం రష్యాకు వెళ్లిక ఆ యువకుడిని బలవంతంగా సైన్యం చేర్చినట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎలాగైన ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన బూటా సింగ్ (25) గత ఏడాది విద్యార్థి వీసాతో రష్యాకు వెళ్లాడు. 2024 అక్టోబర్‌లో ఓ ట్రావెల్ ఏజెంట్ ద్వారా రష్యాకు వెళ్లాడు. అయితే అతడితో పాటు మరో 14 మందిని కలిపి బంధించి ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి పంపించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉంది.
“మేం విద్యార్థి వీసాలతో మాస్కోకు వచ్చాం. ఇక్కడ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ మమ్మల్ని మోసం చేసి రష్యన్ ఆర్మీలో చేర్చి, తుపాకులు ఇచ్చి యుద్ధానికి పంపించారు. మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లండ” అని విజ్ఞప్తి చేశారు. చదువుకుంటునే పార్ట్ టైమ్ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించవచ్చని ఏజెంట్ చెప్పాడని బూటా సింగ్ సోదరి కౌర్ తెలిపింది.
రష్యా వెళ్లేందుకు భూమిని కూడా అమ్మినట్లు ఆమె పేర్కొంది. అయితే వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా తన సోదరుడు రష్య ఆర్మీలో ఉన్నాడని తెలిసింది చెప్పింది. అయితే తమ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, తన సోదరుడితో పాటు మిగిలిన వారిని తీసుకొసురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొంది.
బూటా సింగ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, డిల్లీకి చెందిన ఓ ఏజెంట్ ద్వారా రష్యకు వెళ్లినట్లు తెలిపారు. అయితే ఆ ఏజెంట్ ఎవరో కూడా తమని తెలియదని చెప్పారు. మూడున్నర లక్షలు తీసుకుని ఎనిమిది రోజుల్లోనే వీసా పంపించారని తెలిపారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్