
ఓ ప్రముఖ యోగా గురువును ఓ ముఠా హనీట్రాప్ చేసి లక్షలు కొట్టేసిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆశ్రమం నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి అక్కడ యోగాను నేర్పిస్తున్నారు. ఆ యోగా గురువును అమర్ గ్యాంగ్ పథకం ప్రకారం హనీ ట్రాప్ చేసింది. ఈ ముఠా సభ్యులు ఇద్దరు యువతులను అనారోగ్య కారణాలు చెప్పి ఆశ్రమంలో చేర్పించారు.
యోగా గురువుకు వారి మీద నమ్మకాన్ని కలిగించి, అతనితో సన్నిహితంగా మారారు. అలా ఆ ఆశ్రమంలో ఆశ్రయం పొంది అదును చూసుకుని ఆ ఇద్దరూ యోగా గురువుతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యోగా గురువును గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తర్వాత ఫోటోలు, వీడియోలు చూపించి యోగా గురువును బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు.
మొదటగా రూ.50 లక్షలు డిమాండ్ చేయగా, భయపడిన రంగారెడ్డి రెండు చెక్కుల రూపంలో, ఒక్కో చెక్కు రూ.25 లక్షల చొప్పున వారికి అందజేశారు. అయితే, ముఠా అంతటితో ఆగలేదు. మళ్లీ మళ్లీ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఈ వేధింపులు నిలవవని గ్రహించిన యోగా గురువు, గోల్కొండ పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు అనంతరం, అతను డబ్బు ఇవ్వబోతున్నట్టు నటిస్తూ, పోలీసులు ముందస్తుగా పథకం వేశారు. డబ్బు తీసుకునేందుకు వచ్చిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో అమర్, మౌలాలి, రాజేశ్, మంజుల, రజినీలా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అనంతరం వీరిని రిమాండ్‌కు తరలించామని, ఇంకా మిగిలిన సభ్యుల గురించి తెలుసుకునే పనిలో ఉన్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో మరిన్ని మలుపులు ఉండే అవకాశం ఉందని సమాచారం. రియల్ ఎస్టేట్‌లో డబ్బులు సరిపోకపోవడంతో యోగా గురువును హనీట్రాప్ చేసి, డబ్బులు కాజేయాలని పథకం చేసినట్లు తెలుస్తున్నది. చివరకు యోగా గురువు ఆశ్రమాన్ని టార్గెట్ చేసి ఆయనపై వలపు వల విసిరారని పోలీసులు వెల్లడించారు.
More Stories
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క