17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం

17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
సెప్టెంబర్ 17 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే “సేవా పక్షం అభియాన్” సందర్భంగా తెలంగాణాలో కూడా పక్షం రోజులపాటు సేవా పక్వాడ్ కార్యక్రమం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బిజెపి ఎమ్యెల్సీ మల్క కొమురయ్య  తెలిపారు. అదేవిధంగా  సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


సేవా పక్వాడ్ కార్యక్రమం సమాజం పట్ల మన బాధ్యతను “సేవ” ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో మార్గనిర్దేశం చేస్తుందని ఆయన చెప్పారు. సెప్టెంబరు 17వ తేదీన బిజెవైఎం ఆధ్వర్యంలో జిల్లా/బ్లాక్ స్థాయిలో నిర్వహించే రక్తదాన శిబిరంలలో ప్రతి కేంద్రంలో కనీసం 75 మంది పాల్గొంటారని ఆయన తెలిపారు.

సెప్టెంబరు 18 వ తేదీన మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్కూల్స్, విద్యా సంస్థలు, కమ్యూనిటీ సెంటర్స్ లో వికసిత్ భారత్ + స్వచ్ఛ భారత్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.  సెప్టెంబర్ 21వ తేదీన బిజెవైఎం ఆధ్వర్యంలో మారథాన్ కార్యక్రమం చేబడతామని తెలిపారు. హైదరాబాదులో గచ్చిబౌలి ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమంలో 15,000–20,000 యువత పాల్గొనగలరని చెప్పారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా కోఆర్డినేట్; పాల్గొనేవారికి టీ-షర్ట్ లు, ప్రధాని ఫొటోతో సర్టిఫికెట్లను అందిస్తామని వివరించారు. 
 
ధీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సెప్టెంబరు  25న మొక్కలు నాటే కార్యక్రమం బూత్/బ్లాక్/జిల్లా/రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది.  ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో కనీసం ఒక మొక్క నాటాలని కొమురయ్య పిలుపిచ్చారు. సెప్టెంబరు 26న బిజెపి ఎస్సీ, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో దివ్యాంగులను గుర్తించి, సన్మానం చేస్తారని తెలిపారు.


సెప్టెంబరు 28వ తేదీన విశిష్ట పౌరులకు (పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందినవారు, యూనివర్సిటీ ఛాన్సలర్స్, పబ్లిక్ సర్వీస్ లో సేవలందించిన పెద్దలు) సన్మానం జరుపుతారు.  అక్టోబరు 2వ తేదీన మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు గ్రామాల్లో తయారు చేసిన కాటన్ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ ను సాధించే దిశగా చైతన్యం కల్పిస్తామని కొమురయ్య వివరించారు.

ఈ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. .
“సేవా పక్షం అభియాన్” సందర్భంగా ఈ 15 రోజుల పాటు ప్రజలకు అభివృద్ధి, సామాజిక సేవ, ఆత్మ నిర్భరత, ఎన్విరాన్మెంట్ కేర్, యువత భాగస్వామ్యం అయ్యేలా వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు.