
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదం పొందిన నాలుగు ముఖ్య బిల్లులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపగా, అందులో రెండు బిల్లులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిన్నారం మున్సిపాలిటీలో కొత్త గ్రామాల విలీనానికి సంబంధించి, అలాగే మున్సిపల్ చట్టంలో కొన్ని సవరణలకు గవర్నర్ ఆమోదం లభించింది. ఈ రెండు బిల్లులకు సంబంధించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
అయితే కీలకమైన పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతకు సంబంధించిన బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా బిసి వర్గాలకు 42 శాతం వరకు రేజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సవరణలు చేసింది. అసెంబ్లీ ఆగస్టు 31న, శాసన మండలి సెప్టెంబర్ 1న ఈ బిల్లులకు ఆమోదం తెలిపినప్పటికీ, గవర్నర్ నిర్ణయం ఇంకా వెలువడకపోవడంతో రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్‌లు, పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ బిల్లులపై గవర్నర్ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తే బీసీ వర్గాలకు మరిన్ని స్థానాలు లభిస్తాయి. ఇది స్థానిక స్థాయి నాయకత్వంలో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చు. మరోవైపు.. ఈ నిర్ణయం ఆలస్యమైతే ఎన్నికల షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశముంది.
More Stories
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి మృతి
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది