
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ప్రముఖ డేటాబేస్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఒరాకిల్ కో-ఫౌండర్ అయిన లార్యీ ఎల్లిసన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం, ఆయన ఆస్తి విలువ $393 బిలియన్లుగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఎలిసన్ సంపద ఇప్పుడు 393 బిలియన్ డాలర్లు. ఈ మొత్తం సంపద ఎలాన్ మస్క్ కంటే ఎనిమిది బిలియన్ డాలర్లు ఎక్కువ.
నాలుగేళ్ల కింద ఎలాన్ మస్క్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన నికర విలువ 385 బిలియన్ డాలర్లు. మంగళవారం వరకు మస్క్ ప్రధాన సంస్థ అయిన టెస్లా షేర్లు 14శాతం తగ్గాయి. కృత్రిమ మేధస్సు పోటీలో కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల ఆర్డర్లు ఆధారంగా ఒరాకిల్ అద్భుతమైన ఆదాయ నివేదికను చూపించింది. దాంతో ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.
అయితే, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మస్క్ ఇప్పటికీ 439 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, బ్లూమ్‌బెర్గ్ తన సంపదను 385 బిలియన్లుగా చూపించింది.ఈ సంపద టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంపదను అధిగమించి, ఎల్లిసన్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. ఈ విజయం ఆయన దశాబ్దాల కఠోర శ్రమకు, దూరదృష్టికి నిదర్శనం.
లార్యీ ఎల్లిసన్ కేవలం వ్యాపార ప్రపంచంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎలిసన్‌కు ఒరాకిల్‌లో దాదాపు 40 శాతం వాటాను ఉంది. అంటే స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తక్కువ సమయంలోనే దాని పెరుగుతున్న షేర్లు ఆయన నికర విలువకు వంద బిలియన్ డాలర్లు జోడించింది.
మరో వైపు మస్క్ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో కంపెనీ ఆశించిన బూమ్ ఇంకా కనిపించలేదు. మస్క్ నిరంతరం పెట్టుబడిదారుల దృష్టిని టెస్లా రోబోట్, కృత్రిమ మేధస్సు ప్రాజెక్టుల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ప్రతికూల వార్తలు ఆగడం లేదు.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి