తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్లు

తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్లు

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల టీమ్ మహిళల టీమ్ ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. కాంపౌండ్ టీమ్ విభాగంలో నిరాశపరిచినా మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో రెండో స్థానంతో రజతం కొల్లగొట్టింది. అయితే, పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో  రిషబ్, ప్రథమేశ్, అమన్‌ బృందం మాత్రం పసిడితో మెరిసింది.  దక్షిణ కొరియాలో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఫ్రాన్స్‌పై 235-233 తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది.

ఈ పోటీలో భారత పురుషుల జట్టు తొలిసారిగా బంగారు పతకం గెలుచుకోవడం విశేషం. రిషభ్‌ యాదవ్‌, అమన సైనీ, ప్రతమేష్‌ ఫుజేలతో కూడిన భారత్ త్రయం ఫ్రాన్స్‌పై పైచేయి సాధించింది.  ఫైనల్‌ చేరే దారిలో భారత్‌ ఆస్ట్రేలియా, అమెరికా, టర్కీ వంటి బలమైన జట్లను ఓడించి శిఖరానికి చేరింది. మూడు సెట్ల అనంతరం రెండు జట్లు 176-176తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక సెట్లో భారత్‌ 59 పాయింట్లు సాధించగా, ఫ్రాన్స్‌ 57 పాయింట్లకే పరిమితమైంది. దీంతో భారత్‌ విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది

ఇక ఇదే రోజు భారత్‌కు రెండో స్వర్ణావకాశం వచ్చింది. రిషభ్‌ యాదవ్‌, జ్యోతి శురేఖ వేణం జోడీ మిక్స్‌డ్‌ కంపౌండ్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడింది. మొదట ఆధిక్యంలోకి వచ్చినా, ఒక సెట్లో 37 పాయింట్లకే పరిమితమవడంతో నెదర్లాండ్స్‌ తిరిగి ఆధిపత్యం చెలాయించింది.  ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ డచ్‌ జోడీ విజయం సాధించగా, భారత జోడీ రజతంతో సరిపెట్టుకుంది. మొత్తంగా 2023 ఎడిషన్‌లో భారత ఆర్చరీ జట్టు 15 పతకాలు గెలుచుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.

“ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో ప్రథమేశ్ ఒక్కడే కాదు.. ముగ్గురు ఆర్చర్లు గొప్ప ప్రదర్శన చేశారు. ఏమాత్రం ఒత్తిడిలోకి లోనవ్వకుండా లక్ష్యాన్ని గురి చూసి బాణం వదిలారు. సమిష్టిగా రాణించడంతో భారత్ ఖాతాలో పసిడి పతకం చేరింది” అని చీఫ్ కాంపౌండ్ కోచ్ జివన్‌జ్యోత సింగ్ తేజా వెల్లడించాడు.