
వెనెజులా డ్రగ్స్ ముఠాల నుంచి తమ దేశాన్ని మాదకద్రవ్యాలు ముంచెత్తుతున్నాయంటూ ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ ముఠాలతో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన విమర్శించారు. ఆయనను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా రూ.430 కోట్ల బహుమతి ఇస్తామంటూ కూడా ప్రకటించారు. అమెరికా యుద్ధ దుందుడుకు చర్యలను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తప్పుబట్టారు. తమపై యుద్ధానికి దిగితే తాము కూడా సైనిక దాడితో సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
ట్రంప్ గౌరవం దెబ్బతినేలా ఆయన కార్యదర్శి, విదేశాంగ మంత్రి మార్కో రుబియో కరేబియన్ యుద్ధంలోకి ఆయనను లాగుతున్నారని ఆరోపించారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడంలేదని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్టి వెల్లడించారు. కేవలం మాదకద్రవ్యాల ముఠాల కోసం యుద్ధం స్థాయిలో అమెరికా ఈ బలగాలను మోహరించింది. మొత్తం ఎనిమిది వార్షిప్లను అక్కడకు పంపింది.
ది ఇవో జిమా యాంఫిబియస్ రెడీగ్రూప్లోని యూఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యూఎస్ఎస్ ఇవో జిమా, యూఎస్ఎస్ ఫోర్ట్ లాడర్డేల్ నౌకలు 4,500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. కరేబియన్ సముద్రంలో అగ్రరాజ్యం భారీగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, జలాంతర్గములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది. ఏక్షణామైనా వెనెజులా దేశంలోకి చొరబడటానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు 4,500 మంది సైనికులు, 2,300 మంది మెరైన్లు కూడా సిద్ధంగా ఉన్నారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక