చొరబాట్లు, బెంగాల్ లో పౌర భద్రతపై ఆర్ఎస్ఎస్ ఆందోళన

చొరబాట్లు, బెంగాల్ లో పౌర భద్రతపై ఆర్ఎస్ఎస్ ఆందోళన
బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు, పశ్చిమ బెంగాల్‌లో పౌర భద్రతకు సంబంధించిన సవాళ్లపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈశాన్య రాష్ట్రాలలో తగ్గుతున్న హింస. పెరుగుతున్న అభివృద్ధి సంకేతాలను సానుకూలంగా పరిగణించింది. సంప్రదింపుల ద్వారా శాంతి ప్రయత్నాలకు మణిపూర్‌లో ఇటీవలి చోటుచేసుకుంటున్న సంఘటనలను అభినందించింది.
 
జోధాపూర్ లో మూడు రోజులపాటు జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ ముగింపు సందర్భంగా ఆదివారం అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ మీడియా సమావేశంలో సంఘ్ శతాబ్ది సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలతో సహా విద్య, సమాజం, జాతీయ జీవితంలోని వివిధ అంశాలపై వివరణాత్మక సమాచారాన్ని పంచుకున్నారు.
 
గిరిజన ప్రాంతాలకు సంబంధించి నక్సల్, మావోయిస్టు హింస తగ్గిందని, కానీ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హాస్టళ్లు, గిరిజన హక్కుల సందర్భంలో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం నిర్వహించిన పనులను ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయం,  జాతీయ ఆలోచనను గిరిజన సమాజానికి తెలియజేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 
మూడు రోజుల సమావేశంలో (సెప్టెంబర్ 5–7) విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలియజేశారు.  అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, విద్యా భారతి, శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్, భారతీయ శిక్షా మండల్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వంటి వివిధ సంస్థలు కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో తమ అనుభవాలను పంచుకున్నాయి.
 
ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు, మాతృభాషలో బోధనను ప్రోత్సహించడానికి విద్యలో భారతీయ భాషలను ప్రోత్సహించడానికి సానుకూల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. . భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని, విద్య భారతీయీకరణను ప్రోత్సహించడానికి పాఠ్యపుస్తకాలను తిరిగి వ్రాయడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటి దిశలో కూడా పని పురోగమిస్తోంది. 
 
ఈ పత్రికా సమావేశంలో దేశంలోని సామాజిక పరిస్థితులపై చర్చలు కూడా జరిగాయి. పంజాబ్‌లో యువతలో పెరుగుతున్న మత మార్పిడులు, మాదకద్రవ్యాల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. సేవా భారతి మరియు విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్న అవగాహన,  వ్యసన విముక్తి ప్రచారాల గురించి సమాచారం పంచుకున్నారు. సంఘ్ శతాబ్ది సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికల గురించి కూడా వివరణాత్మక సమాచారం ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణ, కుటుంబ జ్ఞానోదయం, పౌర విధులు వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2025 అక్టోబర్ 02న, నాగ్‌పూర్‌లో జరిగే విజయదశమి ఉత్సవంతో శతాబ్ది సంవత్సర అధికారిక ప్రారంభం జరుగుతుంది.  మహిళల భాగస్వామ్యంపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, సునీల్ అంబేకర్, క్రీడా భారతి మహిళా క్రీడాకారులలో యోగా జ్ఞానం, అధ్యయనాలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ కింద మహిళా కార్యకర్తలు నిర్వహించిన 887 కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, సంస్థలలో మహిళల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 
 
విలేకరుల సమావేశంలో, మత మార్పిడి, చొరబాటు, కాశీ-మధుర వంటి అంశాలను కూడా చర్చించారు. ఈ సమస్యలకు పరిష్కారం సంఘర్షణ లేదా ఆందోళన ద్వారా కాకుండా చట్టపరమైన, పరస్పర చర్చల ద్వారా వెతకాలని స్పష్టం చెప్పారు. భాష ప్రశ్నపై, ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని, అన్ని భారతీయ భాషల పట్ల గౌరవం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
 
ఇంగ్లీషుకు వ్యతిరేకత లేదు, కానీ విద్య, పరిపాలనలో భారతీయ భాషలకు సముచిత స్థానం లభించాలని స్పష్టం చేశారు. కాగా, సెప్టెంబర్ 6 రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో, జానపద గాయకుడు అన్వర్ ఖాన్ ప్రదర్శనను అభినందిస్తూ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఆయనను సత్కరించారు.  శతాబ్ది సంవత్సరం సందర్భంగా ప్రారంభించిన ప్రయత్నాలు రాబోయే సంవత్సరాల్లో కూడా నిరంతరాయంగా కొనసాగుతాయని సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో, జోధ్‌పూర్ ప్రాంట్ సంఘచాలక్ హర్దయాల్ వర్మ, అఖిల్ భారతీయ సహ ప్రచార ప్రముఖ్ లు నరేంద్ర ఠాకూర్, ప్రదీప్ జోషి కూడా పాల్గొన్నారు.