హిందూ సమాజంకు దేవాలయాలు అప్పగించండి!

హిందూ సమాజంకు దేవాలయాలు అప్పగించండి!
 
* ఏపీ బీజేపీ అధ్యక్షుడిని కోరిన విశ్వహిందూ పరిషత్
 
ఆంధ్ర ప్రదేశ్ లోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి రాష్ట్రంలోని దేవాలయాలు అన్నింటిని ప్రభుత్వం నుండి విముక్తి చేసి హిందూ సమాజంకు  అప్పగించే విధంగా బిజెపి చొరవ చూపాలని విశ్వహిందూ పరిషత్ కోరింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ను బిజెపి కేంద్రీయ సంఘటన కార్యదర్శి మీలాండ్ పరాండే, క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవి కుమార్ లతో కూడిన ప్రతినిధివర్గం కలిసి వినతిపత్రం సమర్పించింది. 
 
ఈ ఏడాది విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం లో తీసుకున్న నిర్ణయాలను, అదేవిధంగా ఇటీవల జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  బ్రిటిష్ పరిపాలన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హిందూ సమాజాన్ని నియంత్రించాలంటే వారి దేవాలయాలను నియంత్రణలోకి తీసుకోవాలనే కుతంత్రంలో భాగంగా దేవాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొన్నారని వారు తెలిపారు.