
భారత్‌పై సుంకాల యుద్ధం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి తన అక్కసును వెల్లగక్కారు. జీరో టారిఫ్‌లకు అంగీకరించి, జాప్యం చేస్తోందని అంటూ భారత్‌తో వాణిజ్యం ఏకపక్ష విపత్తు అని పేర్కొన్నారు . ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, వారు (భారత్) దీనిని చాలా ఏళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. అమెరికాకు భారత్‌తో వాణిజ్య బంధం ‘ఏకపక్షమే’నని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు.
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌లను కలిసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ”భారత్‌తో మనం చాలా తక్కువ వ్యాపారం చేస్తాం. కానీ వారు మనతో అపారమైన వ్యాపారం చేస్తారని చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, వారు(భారత్) మనకు భారీ మొత్తంలో వస్తువులను అమ్ముతారు, మనం వారికి అమ్మేది చాలా తక్కువే. ఇప్పటివరకు ఉన్నది ఏకపక్ష సంబంధమే. చాలా దశాబ్దాలుగా ఉన్నది ఇదే” అని ఆయన రాసుకొచ్చారు.
భారత్ విధించిన అధిక సుంకాలు అమెరికా వ్యాపారాలు అక్కడ (భారత్) వస్తువులను అమ్మకుండా నిరోధించాయని వివరించారు. ఈ పరిస్థితి పూర్తిగా ఏకపక్ష విపత్తుకు దారి తీసిందని చెప్పారు. భారత్ చమురు, సైనిక ఉత్పత్తులను రష్యా నుంచి ఎక్కువగా, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఎస్‌సిఒ సమావేశాల్లో భాగంగా భారత్, చైనా, రష్యా ఒకే వేదికపైకి రావటం ట్రంప్‌ను మరింత కలవరపెడుతున్నదని విశ్లేషకులు ఈ సందర్భంగా భావిస్తున్నారు.
More Stories
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ మళ్ళీ మొదలు కావచ్చు
భారత్ చేతిలో మరోసారి చిత్తుగా ఓడిన పాక్