
లక్ష కోట్ల అవినీతి కక్కిస్తా, ఆ డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, దాదాపు 2 సంవత్సరాల పాలన గడిచినా ఇప్పటి వరకు అవినీతి పరులపై కేసులు నమోదు చేయలేదని, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని ఆయన గుర్తు చేశారు.
“100 రోజుల్లో హామీలను నెరవేర్చుతాం, 100 రోజుల్లో అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం, 100 రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి దాదాపు 20 నెలలు గడిచినా ఇప్పటివరకు అవినీతి సొమ్ము బయట పెట్టలేదు” అంటూ గుర్తు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి నివేదిక వచ్చిందని చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలను, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ పక్షాన ఖచ్చితంగా నిలదీస్తాం అని స్పష్టం చేశారు.
మరోవైపు భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించి పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. కేవలం నిర్మల్ నియోజకవర్గంలోనే దాదాపు 10 వేల ఎకరాల పంట నష్టం సంభవించిందని చెప్పారు.
లోతట్టు ప్రాంతాల్లో అనేక ఇండ్లు మునిగిపోయాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిందని, కాన. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో గాలితిరుగుడు తిరగడం కాదు, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలని, మంత్రులను క్షేత్రస్థాయికి పంపించి నష్టాన్ని అంచనా వేయాలని, తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కూడిన బృందం ఈ విషయాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు.
More Stories
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి