
మరోవైపు మహీంద్రా యూనివర్సిటీ హాస్టల్ చుట్టుపక్కల సేకరించిన సమాచారం మేరకు ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక యూనివర్సిటీ విద్యార్థులు కొరియర్ ద్వారా గంజాయిని ఢిల్లీ నుంచి తెప్పించుకుంటున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ కేసులో మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్ల టాంగ్ బ్రూమ్ను అరెస్ట్ చేశారు
కాగా, మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే వీరి వద్ద నుంచి ప్యాకింగ్ సామగ్రి, డిజిటల్ తూకం యంత్రం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూరారం, జీడిమెట్ల, మహీంద్రా యూనివర్సిటీలో దాడులు నిర్వహించి విద్యార్థులు మహ్మద్ అషార్ జావీద్ ఖాన్, నేవీల్ టాంగ్ బ్రామ్తో పాటు జీడిమెట్లకి చెందిన అంబటి గణేశ్, శివకుమార్లను ఈగల్ టీమ్ అరెస్టు చేసింది.
నిందితుల ఫోన్లు పరిశీలించగా దాదాపు 50 మంది డ్రగ్స్ కొనుగోలుదారుల సమాచారం లభించిందని పోలీసులు చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్ పరిసరాల్లో సేకరించిన సమాచారం మేరకు ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొంపల్లిలోని మల్నాడు డ్రగ్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా, ఏ4 హర్షతో పాటు మరొక నిందితుడిని ఈగల్ టీమ్ అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు సూర్యతో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అతడిని గుర్తించారు. ఇటీవలే డ్రగ్స్ విక్రయిస్తూ మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య పట్టుబడ్డాడు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల