
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) రూ. 8.48 లక్షల తలసరి జిడిపితో నాలుగో స్థానంలో ఉంది. ఇది తయారీ, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా రూ. 8.10 లక్షల తలసరి జిడిపితో ఐదో స్థానాన్ని పొందింది. ఫార్మాస్యూటికల్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఈ జిల్లాకు ఆర్థిక బలం చేకూరుస్తున్నాయి.
ఉత్తర , దక్షిణ గోవా జిల్లాలు రూ. 7.63 లక్షల తలసరి జిడిపితో కలిసి ఆరవ స్థానంలో నిలిచాయి. పర్యాటకం, హోటల్ రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు కీలకం.గ్యాంగ్‌టాక్, నామ్చి, మంగన్, గ్యాల్షింగ్ జిల్లాలు రూ. 7.46 లక్షల తలసరి జిడిపితో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాయి. పర్యావరణ సంపద, స్థిరమైన పర్యాటకం ఈ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా రూ. 6.69 లక్షల తలసరి జిడిపితో ఎనిమిదో స్థానంలో ఉంది. విద్య, సేవల రంగం, పోర్ట్ ఆధారిత వాణిజ్యం దీని ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణాలు. భారత ఆర్థిక రాజధాని ముంబై రూ. 6.57 లక్షల తలసరి జిడిపితో తొమ్మిదో స్థానంలో ఉంది. స్టాక్ మార్కెట్, కార్పొరేట్ ఆఫీసులు, బ్యాంకింగ్ సేవలు దీని ప్రధాన బలాలు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా రూ. 6.54 లక్షల తలసరి జిడిపితో పదో స్థానాన్నిదక్కించుకుంది. వస్త్రాలు, రసాయనాలు, ఆధునిక పరిశ్రమలు దీని అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి