గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం అమలుకు మద్దతు

గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం అమలుకు మద్దతు
గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టంను ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు బిజెపి పూర్తి మద్దతు ఇస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ భరోసా ఇచ్చారు.  రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీజేపీ  సారధ్యం కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంతకుమారి ఆధ్వర్యంలో పాడేరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ గిరిజన ప్రాంతాల్లో జీవో నంబర్ 3 అమలు చేయడానికి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తామని  తెలిపారు. 
 
జి ఓ నంబర్ 3ను సుప్రీంకోర్టులో వేయగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దానిపై  పిటిషన్ వేయకుండా, వారి కేసులు కోసం కోట్లు రూపాయల ఖర్చులు చేసి గిరిజన ప్రజలుకు కపట ప్రేమ చూపించి గిరిజన ప్రజలును మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంపై తగిన బుద్ధి చెప్పడానికి ఎన్డీయే కూటమి  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
గిరిజనులకు తగిన న్యాయం చేస్తామని, పోలవరం నిర్మాణం కోసం పూర్తిగా నిధుల ఇచ్చి పూర్తి చేస్తామని, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని మాధవ్ హామీ ఇచ్చారు.  గిరిజన ప్రాంతాల్లో బీజేపీ బలోపేతం చేయడానికి ప్రణాళికలు వేసి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పధకాలు ప్రచారం చేయాలని కార్యకర్తలును ఆయన కోరారు.  రాబోయే ఎన్నికల్లో బీజేపీ గిరిజన ప్రాంతాల్లో కమలం వికశించాలని కోరారు.
గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా స్థానిక ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కావాలని పిలుపునిచ్చారు.  గిరిజన ప్రాంతాల్లో జల జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించే కార్యక్రమంతో నేడు మంచినీరు లభించిందని తెలిపారు.  అల్లూరి సీతారామరాజు జిల్లాలో 17 ఏకలవ్య పాఠాశాలలు నిర్మాణం చేశారని, గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి కావడంతో 50 మంది ఎంబిబీఎస్ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. పూర్తీ స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులోకి రాగలవని తెలిపారు. 
 
గిరిజన ప్రాంతాల్లో మహిళలకు డ్వాక్రా మహిళలకు వందన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటుతో మహిళలుకు గిరిజన ఉత్పత్తులుకు మార్కెట్ సదుపాయాలు వస్తాయని చెప్పారు. ఉపాధి కల్పన కోసం నైపుణ్యాలను వెలికి తీసి గిరిజన ప్రాంతాల్లో ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో వై టి సి లలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, శిక్షణ పొందిన వారికే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు.