
ప్రస్తుత ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్బీకే సింగ్ను తప్పించి ఆయన స్థానంలో సతీష్ గోల్చాను నియమించారు. . ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 1998 ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరామ్, యూనియన్ టెరిటోరియల్స్) కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఎస్బీకే సింగ్ హోమ్ గార్డ్స్ డీజీగా కొనసాగుతూనే ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఆగస్టు 1న అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఇక, తనపై జరిగిన దాడి గురించి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ తాను క్షేమంగా ఉన్నాని, ఇలాంటి పిరికిపంద చర్యలు ప్రజా సేవ చేయాలనే తన సంకల్పాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, త్వరలోనే తాను విధుల్లోకి తిరిగి వస్తానని రేఖా గుప్తా చెప్పారు. అంతేకాదు, మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆమె తెలిపారు.
మరోవంక, ఆమె భద్రతను పెంచారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో జెడ్-కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. దీంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది సీఎం నివాసానికి చేరుకుంది. సీఎంకు 24 గంటలూ రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి నివాసంతోపాటూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. సీఆర్పీఎఫ్తోపాటూ ఢిల్లీ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సీఎంకు నిరంతరం రక్షణ కల్పించనున్నారు.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు