
నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ మృతి పట్ల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మంచి స్నేహశీలి, మృదుస్వభావి అని, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడని, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలందించారని, భారతీయ జనతా పార్టీ తమిళనాడు సంఘటన మంత్రిగా పార్టీ అభివృద్ధికి నిరంతరం నిస్వార్ధంగా పాటుపడ్డ నాయకుడని దత్తాత్రేయ ఆయన సేవలను కొనియాడారు.
నిజ జీవితంలో అన్ని వదిలిపెట్టి కేవలం సమాజం కోసం సమర్థ భావంతో తన జీవితాన్ని అర్పించిన నాయకుడు గణేశన్ అని పేర్కొంటూ దేశ భక్తి, జాతీయభావం, భారతీయ సంస్కృతి పెంపొందింపజేసేందుకు అన్ని వర్గాలతో కలిసి కృషి చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిజెపి ప్రభారిగా వారు పనిచేశారని, బిజెపి అఖిల భారత కార్యదర్శిగా కూడా సేవలందించారని దత్తాత్రేయ వివరించారు.
తాను తమిళనాడు రాష్ట్ర బీ జే పీ ప్రభారిగా ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో అనేక విషయాలు తనతో చర్చించేవారని, తమిళనాడులో ఉన్న డీఎంకే, ఏఐడీఎంకే సహా అన్ని పార్టీలతో వారి సత్సంబంధాలు ఉండేవని చెబుతూ గణేశన్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.
గణేశన్ మరణం జాతీయ వాద సంస్థలకు, తమిళనాడు రాజకీయాలకు తీరని లోటు అని చెప్పారు.
గణేశన్ మరణం జాతీయ వాద సంస్థలకు, తమిళనాడు రాజకీయాలకు తీరని లోటు అని చెప్పారు.
కాగా, నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వహించారని, రాజ్యసభ సభ్యులుగా, తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని చెబుతూ జాతీయ భావంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో సేవలందించారని కొనియాడారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి