పాకిస్థాన్‌లో కుండపోత వానలు… 200 మంది మృతి

పాకిస్థాన్‌లో కుండపోత వానలు… 200 మంది మృతి
 

పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో పరిస్థితి విషమించింది. అనేక ప్రాంతాలలో వర్షాలు వరదల సంబంధిత దుర్ఘటననలో 200 మంది వరకు ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావెన్స్ లోని పర్వత ప్రాంతాలలో మృతి చెందిన్నట్లు భావిస్తున్నారు.  పలువురి జాడ తెలియకుండా పోయింది. మృతులలో 180 మంది వరకు ఖ్పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ వరుసగా రెండు రోజులుగా కుండపోత వానలతో జనం తల్లడిల్లుతున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సహాయ కార్యక్రమాలకు వచ్చిన ఓ హెలికాఫ్టర్ కూలిపోయింది.

 
ఎక్కువగా కైబర్ పక్తూన్‌ఖ్వా ప్రాంతం ఎడతెరిపి లేని కుండపోత వానలతో దెబ్బతింది. కరాకోరం హైవే, బలిస్టాన్ హైవేలపై ట్రాఫిక్ స్తంభించింది. రతిగలి సరస్సు వద్ద చిక్కుపడ్డ 600 మంది యాత్రికులు ఎక్కడివారక్కడే ఉండాలని అధికారులు సమాచారం అందించారు. ఈ ప్రాంతానికి అనుసంధాన రోడ్లు తెగిపొయ్యాయి. కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
 
దీనితో టూరిస్టులు సురక్షిత ప్రాంతాలలోనే ఉండాలని, వాహనాలలో బయటకు రాకూడదని హెచ్చరికలు వెలువరించారు. పరిస్థితి సద్దు మణిగే వరకూ వీరు దిగ్బంధ పరిస్థితిలోనే ఉండాల్సి వస్తోంది. మన్సెహ్రా జిల్లాలోని సిరాన్‌ లోయలో ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడ్డాయని, ఇక్కడ చిక్కుకున్న సుమారు 1300 మంది పర్యాటకులను రక్షించామని ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా ప్రాంతీయ అత్యవసర సేవా ప్రతినిధి తెలిపారు. 
 
జూన్‌ 26 నుండి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. సంబంధిత ఘటనల్లో 360 మందికి పైగా మరణించారని, వీరిలో అధికశాతం మంది మహిళలు, చిన్నారులని చెప్పారు.  గిల్గిట్‌- బాల్టిస్థాన్‌ ప్రాంతంలోని గజర్‌ జిల్లాలో గురువారం ఆకస్మిక వరదల కారణంగా పది మంది మరణించారని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్‌ తెలిపారు. 
 
వాయువ్య ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో బజౌర్‌ జిల్లాలో మహిళలు, చిన్నారులు సహా 16 మంది మరణించారని, మరో 17మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. వాయువ్య పాకిస్తాన్‌లోని బట్గ్రామ్‌ జిల్లాను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని, పది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 18మంది గల్లంతయ్యారని చెప్పారు.
 
 కాశ్మీర్‌లో పాక్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో మరో ఏడుగురు మరణించారని విపత్తు నిర్వహణ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఘటనలపై పాక్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ విచారం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.