ఇంజనీర్ల నిర్లక్ష్యంతో సాగర్ ఎడమ కాలువకు గండి

ఇంజనీర్ల నిర్లక్ష్యంతో సాగర్ ఎడమ కాలువకు గండి
నీటిపారుదల శాఖ అధికారులు కళ్లు మూసుకొని ఎడమ కాల్వపై దించి ఉన్న గేట్లను ఎత్తకుండానే నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా కాలువ గండిపడి వందలాది ఎకరాల్లో సాగులో ఉన్న వరి పంటకు నష్టం జరిగింది. వేంసూరు మండలం కుంచపత్రి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ జలాశయం నిండిపోవడంతో పాలేరు రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు.
 
దీంతో పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఇటీవల సాగర్ ఎడమ ప్రధాన కాలువకు వదిలారు మంత్రులు అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కానీ అధికారులు నిరక్ష్యం వహించడం వలన కనీసం నీళ్ళు వదిలే సమయంలో కాలువలను పరిశీలించి ఎక్కడెక్కడ గేట్లున్నాయి, వాటి పరిస్థితి ఏంది అనే విషయాన్ని కూడా పరిశీలించక పోవడంతో సాగర కాలువకు గండి పడింది. 

వరి నాట్లు వేసే సమయంలో ప్రధాన కాలువకు గండిపడటంతో ఈ ప్రాంతంలో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. అంతేగాక వందలాది ఎకరాల్లో వేసిన వరి పైరు కొట్టక పోయింది సత్వరమే గండిని పూడ్చి నీటిని తిరిగి విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు. అలాగే గత దశాబ్ద కాలంగా సాగరు ఎడమ ప్రధాన కాలువకు ఎలాంటి మరమత్తులు చేయలేదు. 
 
దీంతో కాలువపై ఉన్న యూటలు మేజర్లు మైనర్లు ఆనవాళ్లు కోల్పోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. ప్రధాన కాలువ చెట్లు ముళ్లపొదలతో  నిండిపోయిందిదీంతో కాలువల్లోనీరు సక్రమంగా ప్రవహించడం లేదు.  ఒకవైపు కాలువల పరిస్థితి ఇలా ఉంటే, అధికారులు నీళ్లు వదిలి కళ్ళు మూసుకొని ఉండటంతో గండి పడింది నీళ్లు విడుదల చేసే సమయంలో కాలువపై ఎక్కడెక్కడ మేజర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మైనర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ లాక్కులు ఉన్నాయనే విషయాన్ని కూడా పరిశీలించకుండా విడుదల చేయటం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. 
 
బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని కాలువకు తక్షణమేనీటిని విడుదల చేయాలని, గండి పడిన కాల్వకు మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.