
సామూహిక మత మార్పిడి (ఇద్దరికి మించితే) 5-10ఏళ్ల జైలుశిక్ష, సుమారు రూ.4 లక్షల జరిమానా విధిస్తారు. చట్ట వ్యతిరేక మత మార్పిడి ద్వారా జన్మించే శిశువును చట్టబద్ధంగానే పరిగణిస్తారు. అయితే, పిల్లల వారసత్వ హక్కులు మాత్రం మతం ఆధారంగా కాకుండా సాధారణ వారసత్వ హక్కులు వర్తిస్తాయి.
మతం మారాలని భావిస్తున్న వ్యక్తి మొదటగా డిప్యూటీ కమిషనర్ ఎదుట సంబంధిత డిక్లరేషన్ ఫారమ్ను నింపాలి. ఒకవేళ మతం మారే వ్యక్తి మైనర్ అయితే, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఫారమ్ బీ నింపాలి. మత పెద్దలు, నిర్వాహకుల సమక్షంలో మార్పిడి జరుగుతుంటే అందుకు సంబంధించిన వివరాలను ముందుగానే ఫారమ్ సీ ద్వారా అందించాలి. ఆ తర్వాత వీటిని పరిశీలించి డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేస్తారు.
నోటీసులు జారీ చేసిన తర్వాత ఎవరైనా 30 రోజుల్లో డిప్యూటీ కమిషనర్కు అభ్యంతరాలు తెలపాలి. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తారు. మత మార్పిడి బలవంతంగా, మోసపూరితంగా జరిగినట్లు తేలితే దీనిని రద్దు చేస్తారు. అయితే, ఎవరి మత స్వేచ్ఛను అడ్డుకోమని ప్రభుత్వ ఉద్దేశం కాదని, దీని పేరిట చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమేనని తెలిపింది.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!