అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పిండడం, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం లక్ష్యం అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. చమురు, గ్యాస్ రంగాల్లో అనిశ్చితి కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మధ్యతరగతికి వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా చూడడం కోసం, రూ.30 వేల కోట్ల సబ్సిడీ ఆమోదించినట్లు తెలిపారు అశ్విని వైష్ణవ్ .
ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన (పిఎంయువై) 2016 మే లో ప్రారంభమైంది. భారతదేశం అంతటా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, వయోజన మహిళలకు డిపాజిట్ లు లేకుండా ఎల్ పిజి కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా సాగుతోంది. 2025 జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా 10కోట్ల 33 లక్షల ఎంఎంయువై కనెక్షన్లు పంపిణీ చేశారు.
ఉజ్వల యోజన సబ్సిడీ కొనసాగించడం వల్ల వినియోగదారుడు ఎటువంటి డిపాజిట్ లేకుండానే ఎల్ పిజి కనెక్షన్ అందుకుంటాడు.అంతేకాదు, సిలెండర్, ప్రెషర్ రెగ్యులేటర్, సేఫ్టీ హోస్, డమొస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డు బుక్ లెట్ అందించడంతో పాటు ఇన్స్టలేషన్ చార్జీలకోసం సెక్యూరిటీ డిపాజిట్ ను కవర్ చేస్తుంది. ఉజ్వల 2.0 పథకం కింద వినియోగదారుడు తన మొదటి స్టవ్, రీఫిల్ కూడా ఉచితంగా పొందుతారు.

More Stories
అత్యంత వేగంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం