హైదరాబాద్, మాధాపూర్ లో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వనరులు, శిక్షణ కేంద్రం (సీసీఆర్డీ)లో సుమారు రూ. 23 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న నూతన సాంస్కృతిక ఆడిటోరియం సాంస్కృతిక కేంద్రం సంగీత నాటక అకాడమీ పనులు ఈ ఏడాదిలో చివరకు పూర్తయి, డిసెంబర్ చివరిలోగా కళాకారులకు అందింపగలమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
శనివారం అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి గతంలో తాను కేంద్ర సాంస్కృతిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ పనులు చేపట్టామని గుర్తు చేశారు.
పనులు 60 నుండి 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి సిసిఆర్టిలో రవీంద్ర భారతి లాంటి ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈరోజు హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఉన్నటువంటి ఏకైక సెంటర్ రవీంద్ర భారతి అని చెబుతూ పెరుగుతున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని మంజూరు చేశారని ఆయన వివరించారు. సంగీత నాటక అకాడమీ చైర్మన్ తో కలిసి జరుగుతున్న పనులు పరిశీలించామని చెబుతూ వేగంగా పనులు పూర్తిచేయాలని కోరినట్లు చెప్పారు.
భవిష్యత్తులో కళాకారులకు, అదే విధంగా వివిధ సినిమా కార్యక్రమాలు అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే అదనపు నిధులు కూడా మంజూరు చేయించి ఈ హాల్‌ను ఇంకా మరి అందంగా, ఆకర్షణీయంగా, అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.

More Stories
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు
సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు
తెలంగాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వాయిదా !